టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్‌కు చేరుకుంది. కొద్ది క్షణాలలో ఎండ్ కార్డ్ పడనున్న సంగతి తెలిసిందే. ఈరోజు రాత్రి బిగ్ బాస్ 9 గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఈ క్రమంలోనే.. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కప్ ఎవరు కొడతారని ఉత్కంఠ.. అందరిలోను మొదలైంది. ఎవరు ట్రోఫి అందుకుంటారో చూడాలి.
డిసెంబర్ 20న బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే షూట్‌ను ప్రారంభించేసారని.. నిన్న రాత్రికే ఇమ్మానుయేల్, సంజనా గల్రాని, డిమాన్ హౌస్ నుంచి బయటకు వచ్చేసారు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా.. టాప్ కంటెస్టెంట్‌గా ఆడియన్స్ మనసులు గెలుచుకున్న ఇమ్మానుయేల్.. అతి తక్కువ ఓటింగ్‌తో టాప్ ఫోర్ లో బయటకు వచ్చేయడం ఫాన్స్ లో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే.. బిగ్బాస్ ఫుక్ ఎలిమినేషన్ అంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే.. ఇమాన్యుల్ టాప్ 4లోనే ఎలిమినేషన్ అయిపోయినా.. ఈ 15 వారాల్లో విన్నర్ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నాడట. రోజుకు రూ.35000 అంటే.. వారానికి రూ.2.25 లక్షల చొప్పున భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి 15 వారాలకు ఎమ్మెల్యే రూ.33 లక్షల 75 వేల వరకు సంపాదించాడట. బిగ్బాస్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఉంది. ఆ లెక్కన చూస్తే.. దాదాపు విన్నర్ ప్రైజ్ మనీకి దగ్గరగా వచ్చేసాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక.. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో మాత్రం.. తనుజ, కళ్యాణ్‌లమధ్య స్ట్రాంగ్ కాంపిటీషన్ నెలకొంది. ఇక వీళ్లిద్దరిలో.. విన్నర్ కప్పును ఎవరు గెలుచుకుంటారో వేచి చూడాలి.


