బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది. గత వారం రోజులుగా లక్షల పదిమంది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొల్పిన సీజన్ 9 విజేతగా ఓ కామనర్ సక్సెస్ కొట్టి చరిత్ర సృష్టించాడు. టైటిల్ విన్నర్ గా పవన్ కళ్యాణ్ పడాల కప్ అందుకున్నాడు. వేలాది మంది కామెంట్స్ ను దాటుకుని 1500ల మందిలో ఒక్కడిగా అగ్ని పరీక్షలో అడుగుపెట్టి.. తన ఆటతీరుతో ఆడియన్స్‌ను మెప్పించాడు.. ఫస్ట్ కామనర్‌గా హౌస్ లోకి అడుగుపెట్టి నెంబర్ 1గా నిలిచాడు. అయితే.. మొదటి మూడు వారాలు ఆట సరిగ్గా ఆడకుండా జనాల్లో నెగెటివిటీని పెంచుకున్నా.. తర్వాత మాత్రం తన గేమ్ స్ట్రాటజీతో, మాట తీరు, ఆట తీరుతో ఆడియన్స్ను కట్టిపడేసాడు.

రోజురోజుకు మరింతగా ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. ప్రతి టాస్క్‌లోను సత్తా చాటుకున్నాడు. ఒక జెన్యూన్ ప్లేయర్‌గా నిలిచి మొదటి నుంచి విన్నర్ రేసులో దూసుకుపోతున్న తనుజకు.. స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్‌తో పాటు.. కోట్లది మందిగా ఆడియన్స్ హృదయాలను గెలుచుకుని ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఇక కళ్యాణ్ పడాలకు విన్నర్ ప్రైజ్ మనీతో పాటు.. రెమ్యునరేషన్ ఏ రేంజ్‌లో అందిందో.. మొత్తం ఎన్ని లక్షలు ఇంటికి తీసుకెళ్లాడు ఒకసారి చూద్దాం.

బిగ్బాస్ విన్నర్ కు తెలుగులో రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. అందులో రూ.15 లక్షలు తీసుకుని డిమోన్ పవన్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. దీంతో.. ప్రైజ్ మనీ రూ.35 లక్షలు మిగిలింది. అలాగే.. కళ్యాణ్ వారానికి రూ.2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో.. మొత్తం 15 వారాలకు రూ.30 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నాడట. ప్రైజ్ మనీ రూ.35 లక్షలు, రెమ్యునరేషన్ 30 లక్షలు కలుపుకొని.. మొత్తం రూ.65 లక్షల వరకు కళ్యాణ్ పడాల సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు.. ఓ మారుతి సుజుకి కార్ కూడా గిఫ్ట్ గా ప్రకటించారు. ఏపీలోని విజయనగరానికి చెందిన కళ్యాణ్ పడాల కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సొంతం చేసుకున్నాడు. మూడేళ్లు సైనికుడుగా సేవలు అందించిన తర్వాత తన చిన్ననాటి కల నటనపై ఆసక్తితో బిగ్ బాస్ వైఫ్ అడుగులేసాడు. వేలాదిమందిని దాటుకుని అగ్నిపరీక్షల్లో సక్సెస్ కొట్టాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ట్రోఫీ గెలిచి విజేతగా మారాడు. ప్రస్తుతం కళ్యాణ పడాల సక్సెస్‌ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

