చిరు మూవీ ప్రమోషన్స్ లో AI మ్యాజిక్.. అనిల్ వీడియో చూశారా..?

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా అనిల్ రావిపూడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అనిల్ రావిపూడి సినిమాలు వస్తున్నాయంటే ఆయన ప్రమోషన్స్ కింగ్ గా మారిపోతాడు. డిఫరెంట్ వేస్‌లో రకరకాలుగా సినిమాను ప్రమోట్ చేస్తూ రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో భారీ హూప్‌ క్రియేట్ చేయడం అనిల్ స్పెషాలిటీ. ఆయన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లే టెక్నిక్స్ చాలానే ఫాలో అవుతాడు. నిజానికి అప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు సినిమా ప్రమోషన్స్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఆడియన్స్ సైతం సినిమాపై ఆసక్తిని చూపిస్తారు.

Anil Ravipudi Confirms His Template is Making a Comeback

ఇక ప్రస్తుతం అనిల్ – చిరంజీవి మన‌శంకర్ వరప్రసాద్ గారు సినిమా షూట్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తాజా ట్రెండ్‌ను ఫాలో అవుతూ తన కొత్త సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతకీ ఆయన చేసిన ప్రమోషన్ మరేదో కాదు.. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేసిన ఈ క్రేజి వీడియో.. తన ఎక్స్ ఖాత వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ వీడియోకు.. నేను అలా చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు అనే క్యాప్షన్‌ను జోడించాడు.

Anil Ravipudi, Chiranjeevi's film Mana Shankara Vara Prasad Garu's release date | Regional-cinema News – India TV

ప్రస్తుతం ఈ వీడియో నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. అనిల్ రావిపూడి.. మెగాస్టార్ హిట్ సినిమాలు ఖైదీ, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాల సెట్స్ కు వెళ్లి అక్కడ మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ దిగినట్లు ఆ వీడియోలో ఉంది. ఈ క్రమంలోనే వీడియో వైరల్ అవ్వడంతో.. మన శంక‌ర వరప్రసాద్ గారు సినిమాకు కూడా భారీ ప్రమోషన్ జరిగినట్లు అయింది. ప్రస్తుతం ఆయన చిరంజీవి, నయనతార కాంబోలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సైతం కీలక పాత్రలో మెరవనున్న సంగతి తెలిసిందే. 2026 జనవరి 12న ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.