NBK 111 కోసం బాలయ్య వర్కౌట్స్.. నటసింహం నయా గెటప్ లోడింగ్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్‌ల‌ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోల్లో ఎవ్వరికి లేని రేంజ్‌లో సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు బాలయ్య. చివరిగా.. అఖండ 2తో ఆడియన్స్‌ను పలకరించి పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్న బాలయ్య.. ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని కాంబినేషన్‌లో మరో సినిమాకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. సతీష్ కిలారు ప్రొడ్యూసర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను.. పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందించనున్నారు. ఇక.. ఈ సినిమాలో బాలయ్య స్పెషల్ రోల్‌లో కనిపించనున్నాడని.. దానికోసమే వర్కౌట్స్ మొదలెట్టేసారు అంటూ టాక్ వైరల్‌గా మారుతుంది.

ఇంతకీ ఆ స్పెషల్ రోల్ ఏంటి అనుకుంటున్నారా.. సినిమాలో ఓ పర్టిక్యులర్ ఎపిసోడ్ కోసం బాలయ్య యంగ్‌ గెటప్‌లో కనిపించనున్నాడట. దీని కోసం.. ప్రస్తుతం బాలయ్య తన లుక్స్ విషయంలో కసరత్తులు మొదలుపెట్టారని తెలుస్తుంది. మొత్తానికి స్పెషల్ ఎపిసోడ్‌లో బాలయ్య.. యంగ్‌ గెటప్ ఆడియన్స్‌కు థ్రిల్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం. కాగా.. ఈ సినిమాల్లో హీరోయిన్గా లేడీ సూప‌ర్ స్టార్‌ నయనతార మెరవనుంది. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు గతంలో గోపీచంద్ – బాలయ్య కాంబోలో విరసింహారెడ్డి తెర‌కెక్కి మంచి సక్సెస్ అందుకుంది.

ఈ క్రమంలోనే ఈ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇక మూవీ స్టోరీ విషయానికొస్తే.. సినిమాల్లో కొంత హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్ ఉండబోతుందని.. బాలయ్య అందులో మహారాజు పాత్రలో మెరవ‌నున్నారని సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ చేశారు. అంతేకాదు.. సినిమా గురించి గోపీచంద్ ఎక్స్ వేదికగా అప్పుడప్పుడు రియాక్ట్ అవుతూ.. ఆడియన్స్‌లో బ‌జ్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గాడ్ ఆఫ్ మాసేస్ బాల‌య్య‌తో ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉంటుంది అంటూ.. బాలకృష్ణతో కలిసి పనిచేస్తున్నందుకు హ్యపీగా ఫీల్ అవుతున్నాను అంటూ చెప్పవచ్చాడు. అంతేకాదు.. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా కాబోతుంది అంటూ షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య 111వ సినిమా విషయంలో ఆడియన్స్ లో మంచి హైప్‌ మొదలైంది.