టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చిరుకు మరో హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. దీనికి తగ్గట్టుగానే.. స్టోరీని గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేశాడు అనిల్.
ఈ మూవీలో.. చిరు హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన.. నయనతార హీరోయిన్గా మెరువనుంది. ఇక.. ఈ మూవీలో మరో హైలెట్ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించడం. ఇందులో ఓ సాంగ్‌తో పాటు.. దాదాపు 20 నిమిషాల నడివిలో వెంకటేష్ పాత్ర కనిపించనుందట. సినిమాల్లో ఆ పాత్ర కోసం వెంకటేష్ ని తీసుకోవడానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి అని.. ఆయనే వెంకటేష్‌ను సజెస్ట్ చేసినట్లు.. మేకర్స్ కూడా ఒప్పించినట్లు సమాచారం.
దీంతో.. వెంకటేష్ కూడా వెంటనే సినిమాలో రోల్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కాగా.. ఇటీవల వెంకటేష్ రోల్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు మేకర్స్. త్వరలోనే సినిమా ఆడియన్స్‌ను గ్రాండ్ లెవెల్లో పలకరించనుంది. ఇదిలా ఉండగా.. చివరిగా వెంకటేష్, అనిల్ కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. కోట్ల కలెక్షన్ కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక త్వరలోనే సినిమాకు సీక్వల్ రానందంటూ అఫీషియల్‌గా మేకర్స్ వెల్లడించారు.



