గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కు రాజమౌళి సూచనలు ఇవే.. వాళ్లకు నో ఎంట్రీ..!

టాలీవుడ్ ద‌ర్శ‌క ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న మోస్ట్ ప్రెస్టేజియ‌స్‌.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎస్‌ఎస్‌ఎంబి 29. ఈ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ లో ఈ నెల 15న గ్రాండ్ లెవెల్ లో నిర్వహించనున్నారు. ఈ వేడుకలో భాగంగా.. మూవీ టైటిల్‌తో పాటు.. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో.. ఈ ఈవెంట్‌కు భారీ ఎత్తున అభిమానులు క్యూ కట్టనున్నారు. ఈ క్రమంలోనే.. డైరెక్టర్ రాజమౌళి ఈవెంట్ కు వచ్చే వారికి కొన్ని సూచనలు ఇస్తూ.. వీడియోను రిలీజ్ చేశాడు. ఈవెంట్ పీస్ లు ఉన్నవాళ్ళకు మాత్రమే అనుమతులు ఉంటాయని.. మిగతా వాళ్లకు నో ఎంట్రీ.. దయచేసి రావద్దంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఎస్ఎస్ఎంబి 29 గ్లోబల్ ట్రోట‌ర్ ఈవెంట్ బాగా జరగాలంటే మీ సహకారం నాకు చాలా అవసరం.. ఈవెంట్ పట్ల క్రేజ్ ఎక్కువగా ఉన్న క్రమంలో.. పోలీసులు చాలా ఆంక్షలు విధించారు.. వాటిని తప్పకుండా పాటించాల్సిందే. ఇక ఇది ఓపెన్ ఈవెంట్ అని ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి.. కానీ అవన్నీ తప్పుడు ప్రచారాలు. ఈ కార్యక్రమం బహిరంగంగా జరగడం లేదు. ఫిజికల్ పాస్‌లు ఉన్న వారికి మాత్రమే అనుమతి లభిస్తుంది. పాస్‌లు లేకున్నా సరే అనుమతి ఇస్తారని వస్తున్న ప్రచారాలన్నీ నమ్మకండి. ఆన్లైన్లో అస్సలు మేము పాస్‌లు అమ్మట్లేదు. మాకు అనుమతి ఉన్నమేర మాత్రమే.. పాసులు జారీ చేస్తున్నాం. అదే పాస్ పై క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. ఎలా రావాలి కూడా అందులో క్లియర్ గా మెన్షన్ చేశాం. దాన్ని ఫాలో అవుతూ వేదిక వరకు రావచ్చు.

ఇక.. శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఈవెంట్ కు అనుమతి ఉంటుంది. 18 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు.. సీనియర్ సిటిజన్‌లు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. కనుక.. ఈ కార్యక్రమానికి వాళ్ళు రావద్దని కోరుతున్నా. ఇంటిదగ్గర ఉండి జియో హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎంజాయ్ చేయండి. రీసెంట్‌గా జరిగిన పలు సంఘటనలను.. పోలీసులు దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఆంక్షలు పెట్టారు. కార్యక్రమం ఏదైనా సరే.. పొరపాటు జరిగితే వెంటనే రద్దు చేస్తామని కమిషనర్ వెల్లడించారు. కనుక.. వాళ్ళ సూచనలను తప్పకుండా పాటిద్దాం అంటూ రాజమౌళి వెల్లడించాడు. ఇక పాస్లు ఉన్న వాళ్ళు.. వేదిక వద్దకు ఎలా చేరుకోవాలని అంశాలను వీడియాలో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.