టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన కమర్షియల్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను నటిస్తూ.. తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. తాజాగా నటించిన మూవీ ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో దక్షిత్ శెట్టి హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. కమర్షియల్ సినిమాలతో సక్సెస్ ఫుల్ జోష్‌లో ఉన్న టైంలో.. రష్మిక లేడీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ ఎంచుకోవడం బిగ్ రిస్క్ అనే చెప్పాలి. మరి.. రష్మిక ఈ రిస్కీ జర్నీ ఎలాంటి రిజల్ట్ అందుకుంది.. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా హిట్టా.. పట్టా.. ఒకసారి రివ్యూ లో చూద్దాం.

స్టోరీ:
భూమా (రష్మిక) ఎమ్.ఏ.లిటరేచర్ చదువుతూ ఉంటుంది. తండ్రి రావు రమేష్‌ను ఒప్పించి హాస్టల్‌లో జాయిన్ అయ్యి.. అక్కడే కాలేజీలో తన చదువును కంటిన్యూ చేస్తోంది. తన ద్యాస ఎప్పుడు చదువుపైనే ఉంటుంది. ఇక అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి) ఎంఎస్‌సీ చదువుకుంటూ ఉంటాడు. చదువులోనే కాదు.. అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉండే విక్రమ్ అంటే.. అందరు అమ్మాయిలు తెగ ఇష్టపడిపోతూ ఉంటారు. కానీ.. విక్రమ్ మాత్రం.. భూమా వెంటపడతాడు. భూమా కూడా మెల్లమెల్లగా విక్రమ్ ప్రేమలో పడిపోయింది. కానీ.. విక్రమ్ పొసెసివ్.. తనకు మాత్రమే భూమా సొంతమని ఫీల్ అవుతూ ఉంటాడు. నేను ఉంటే నీకు ప్రపంచం తో పని ఏంటి అంటూ ఎప్పుడూ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాడు.
ఈ క్రమంలోనే.. భూమా.. విక్కి నాకు అసలు కరెక్టా.. కాదా.. అనే సందిగ్ధతలో పడిపోతుంది. అలాంటి టైంలో.. భూమా తన తండ్రికి విక్రమ్‌తో కలిసి చూడరాన్ని స్థితిలో దొరికిపోతుంది. దీంతో.. కూతుర్ని తండ్రి వదిలేసి వెళ్ళిపోతాడు. అటు ప్రేమించిన వాడితో లైఫ్ షేర్ చేసుకోవాలో వద్తో తెల్చుకోలేక.. ఇటు తండ్రి నమ్మకాన్ని కోల్పోయి భూమా సతమతమైపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆమె జర్నీ ఎటువైపు.. ఎలాంటి డెసిషన్ తీసుకుంది అనేది స్టోరీ.
రివ్యూ:
సాధారణంగా ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని బ్రేకప్ చెప్పుకున్నారంటే.. అందులోనూ మొదట బ్రేకప్ ప్రపోజల్ అమ్మాయి నుంచే వచ్చిందంటే.. ఆమెను ఎంతోమంది తప్పు పడుతూ.. తన వైపు వేలు చూపిస్తారు. వాడుకొని వదిలేసిందని హాట్ కామెంట్స్ చేస్తారు. కానీ.. అమ్మాయిలు కోణం నుంచి ఎవరు చూడరు. ఈ క్రమంలోనే చాలామంది ఎన్ని బాధలు పడ్డ, కష్టాలు పడ్డ.. అదే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ప్రేమ, పెళ్లి పేరుతో తమ హక్కులు ఒక్కొక్కటిగా కోల్పోతారు.. అలా కాకుండా తనకేం కావాలో నిర్ణయించుకునే హక్కు.. ఓ అమ్మాయికి ఉంటుందని బలంగా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఇక.. సినిమా క్లైమాక్స్ లో భూమా చెప్పే నాలుగు మాటలు, మూవీ మధ్యలో అమ్మాయిల కోణం నుంచి వచ్చే అంశాలు సినిమాకు ప్రాణం పోసాయి.
ఆ డైలాగ్స్ ను అర్థం చేసుకుని.. సన్నివేశానికి కనెక్ట్ అవ్వగలిగితే సినిమా ఆడియన్స్ కు నచ్చేస్తుంది. ఇక కథ కాలేజీలో హీరో, హీరోయిన్ ఎంట్రీ తో మొదలవుతుంది. కాలేజీలో సన్నివేశాలు, అక్కడ వాతావరణం.. మెల్లమెల్లగా భూమా, విక్రమ్ పరిచయం.. వాళ్ళు ప్రేమలో పడడం.. విక్రమ్‌లోని పొసెసివ్‌నెస్ బయటకు రావడం.. మెల్లమెల్లగా కథ పై ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. విక్కీ.. భూమాకు అసలు సరైన వాడ.. కాదా.. అనే సందేహం ఆడియన్స్ లో మొదలవుతాయి. ఇక.. ఇంటర్వెల్‌లో విక్కి ఇంటికి భూమా వెళ్లే సీన్స్.. అక్కడ రోహిణి రోల్.. ఆమె క్యారెక్టతైజేషన్‌తో అసలు సంఘర్షణ ఎటువైపు నుంచి ప్రారంభమవుతుందో క్లియర్ గా రాహుల్ చూపించాడు.

ఇక సరైన టైంలో రావు రమేష్ ఎంట్రీ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది.. లవర్ కి, తండ్రికి మధ్యన భూమా నలిగిపోయే సీన్స్ ఆడియన్స్ కు చాలావరకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాడు. ఇక దుర్గ 9అను ఇమ్మానియేల్) రోల్ ఫస్ట్ రొటీన్ గా అనిపించినా,, తర్వాత పాత్ర ఫుల్ ఇంపాక్ట్ అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లో బ్రేకప్ వరకు సినిమా అంతా ఆసక్తిగా సాగినా.. తర్వాత కాస్త ల్యాగ్ మొదలైంది. హీరోకు బ్రేకప్ చెప్పే సమయంలో బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి కదా.. మరి నన్ను ఎలా పోషిస్తావు అని అడగడం హీరోయిన్ పాత్రను డి గ్రేడ్ చేసినట్లు అనిపిస్తుంది. నీ ఇంటికి వెళ్లి చూసా.. మీ అమ్మలో నాకు నేను కనిపించా.. రేపు మన పెళ్లయిన తర్వాత నా పరిస్థితి కూడా అదే కదా అంటూ రష్మిక ప్రశ్నించాల్సిన చోట.. ఉద్యోగం ,సంపాదన, పోషణ అంటూ మాట్లాడడం అసలు సమంజసం కాదనే ఫీల్ ఆడియన్స్ లో కలుగుతుంది. అయితే.. సినిమా మొత్తానికి హైలైట్ క్లైమాక్స్‌లో రష్మిక ఇచ్చే స్పీచ్. అక్కడ మాట్లాడే డైలాగ్స్ యూత్ లో.. ముఖ్యంగా ఆడపిల్లలకు కనెక్ట్ అవుతాయి. సినిమా చూసే అంతసేపు గర్ల్స్ లో బాబోయ్ ఇలాంటి బాయ్ఫ్రెండ్ అస్సలు వద్దే వద్దు అనే ఫీల్ కలుగుతుంది.
నటీనటుల పర్ఫామెన్స్:
రష్మిక కథ పూర్తిగా నమ్మింది.. ఈ క్రమంలోనే తన పాత్రకు తగ్గట్టుగా అమాయకత్వం, కన్ఫ్యూజన్ అద్భుతంగా పండించింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. రష్మిక పాత్ర మాత్రం విజృంభించింది. దక్షిత్ శెట్టి నటన కూడా ఆకట్టుకుంటుంది. విక్రమ్ రోల్ సాగే తీరు చూస్తే.. తెలుగు హీరోలు ఇలాంటి పాత్ర అస్సలు చేయలేరేమో అనే ఫీల్ ఆడియన్స్ కు కలుగుతుంది. ఇక.. రావు రమేష్ కనిపించింది రెండు మూడు సీన్లు అయినా.. సినిమా పై తన ఇంపాక్ట్ బాగా కనిపించింది. ముఖ్యంగా.. రాహుల్ రవీంద్రంతో మాట్లాడే సన్నివేశాలు.. వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ బాగా ఆకట్టుకుంది.
![]()
టెక్నికల్ గా:
రాహుల్ తను అనుకున్న కథను రాసుకున్న పాయింట్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చూపించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ జర్నీలో అక్కడక్కడా కాస్త లాగ్ ఉన్న.. ఆడియన్స్‌ను మాత్రం ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. ఇక పాటలు సందర్భానికి తగ్గట్టుగా రావడం.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ కు, కంటెంట్ కు మరింత బలాన్ని చేకూర్చాయి. నిర్మాణ విలువలు కళ్లకు కట్టినట్లు కనిపించాయి.
ఫైనల్ గా:
భూమా పాత్రలో ట్రావెల్ చేసి రోల్‌ను ఓన్ చేసుకున్న వాళ్లకు సినిమా నచ్చేస్తుంది. మిగిలిన వాళ్లకు యావరేజ్ మూవీ.

