రంగస్థలం 2.. హీరో , హీరోయిన్ విషయంలో బిగ్ ఛేంజ్‌.. చివరకు ఆమె క్యారెక్టర్ కూడా రీప్లేస్ చేశారా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన రంగస్థలం సినిమా టాలీవుడ్ ఆడియన్స్‌లో ఎలాంటి ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్ఫుల్ ఎమోషన్స్‌తో చిట్టిబాబు – రామలక్ష్మి లవ్ స్టోరీ నీ కలిపి అన్ని ఎమోషన్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించి సుక్కు బ్లాక్ బాస్టర్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి లెక్కల మాస్టర్ అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నాడట‌. రంగస్థలం 2 కోసం సుకుమార్ అన్ని సిద్ధం చేసేసాడ‌ని.. ఈసారి కథ కేవలం సీక్వెల్ గానే కాదు.. సరికొత్త ట్విస్ట్‌లు.. కొత్త కొత్త ఎమోషన్స్ తో.. మరింత ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేస్తున్నాడంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సరికొత్త అర్బన్ బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులు కనెక్ట్ చేసేలా ఓ బలమైన స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం చేసేసాడట.

Kriti Sanon & Jr NTR Team Up For An Interesting Project, Fans Can't Keep  Calm As A Fresh Jodi Rules The Screen

ఇక రంగస్థలం సీక్వెల్ కనుక దీనికి కూడా చర‌ణ్‌ హీరోగా నటిస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. చరణ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట. కారణం.. ఉపాసన ప్రజెంట్ ప్రెగ్నెంట్. ఈ క్రమంలోని తాత్కాలికంగా షూట్‌ల‌కు బ్రేక్ ఇచ్చిన చరణ్.. సుక్కుతో రంగస్థలం 2ను కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో.. సుకుమార్ మరో స్టార్ హీరోను అప్రోచ్ అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే.. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం.. ప్రభాస్ లేదా ఎన్టీఆర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీళ్ళలో ఎవరు ఫైన‌ల్ అయ్యినా సినిమాపై మరింత హైప్‌ పెరుగుతుంది. అంతేకాదు హీరోయిన్ విషయంలోనూ బిగ్ ఛేంజ్ జరుగుతుందట. రామలక్ష్మి రోల్లో సమంత ఆడియన్స్‌కు కనెక్టై.. అందరి మనుసులు దోచేసింది. స్క్రీన్ పై ఒక కొత్త ఫేస్ చూపించాలని.. అది కూడా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సన్నన్‌ అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడట.

Laya Biography | Singavarapu

ఆమె పాన్ ఇండియన్ ఇమేజ్, నటన దృష్టిలో పెట్టుకుని పాత్రకు సరిగ్గా సెట్ అవుతుందని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడ అంతకంటే బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. రంగమ్మఅత్త పాత్ర‌లో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన‌ అనసూయ భరద్వాజ్‌ కూడా రీప్లేస్ చేయనున్నాడట. ఈసారి ఆ పవర్ ఫుల్ క్యారెక్టర్ ను సీనియర్ ముద్దుగుమ్మ లయ ప్లే చేయనుంది. ప్రస్తుతం ఈ కాస్టింగ్ వివరాలు వైర‌ల్‌గా మారడంతో.. అంత షాక్ అవుతున్నారు. ఆమె అసలు ఈ పాత్రకు సెట్ అవుతుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి.. సుకుమార్ నిజంగానే రంగస్థలం 2 ను ఇలా తెర‌కెక్కించి.. మళ్లీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేయగలడా.. లేదా.. వేచి చూడాలి.