‘ రాజాసాబ్ ‘ షూట్ పెండింగ్.. బడ్జెట్ దెబ్బకు చేతులెత్తేసిన నిర్మాత..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్.. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న గ్రాండ్ లెవెల్‌లో సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. ఇక.. ఈ సినిమాకు రెండు రోజుల నుంచి ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఇక‌.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై.. ఫ్యాన్స్‌లో మిక్స్డ్ రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఈ సినిమాకు థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించగా.. ఆయనను ట్యాగ్ చేస్తూ ఓ రేంజ్ లో ట్రోల్స్ ను మొదలుపెట్టారు రెబల్ అభిమానులు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ కి ఆయన సాంగ్స్ కు ఇలాంటి కంపోజిషన్ చేస్తావా అంటూ బండబూతులతో ఆడేసుకుంటున్నారు.

అయితే కొంతమంది మాత్రం.. పాట ఎలా ఉన్నా జనాల్లోకి మూవీ స్ట్రాంగ్ గా వెళ్తుంది అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్‌ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదట.. ఐదు రోజుల్లో షూటింగ్ బ్యాలెన్స్ ఉండనే ఉంది.. అలానే సినిమాలో కొన్ని సీన్స్.. రీషుట్ కూడా చేయాల్సిన అవసరం ఉందట‌. కానీ.. నిర్మాత మాత్రం దీనికి చేతులెత్తేసాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. బడ్జెట్ హద్దు దాటేసిందని.. రెండుసార్లు విఎఫ్ఎక్స్ కోసం భారీగా డబ్బులు ఖర్చు అయ్యాయని.. ఈ క్రమంలోనే సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన ప్రొడ్యూసర్ నావల్ల కాదని చెప్పేసాడని తెలుస్తుంది.

అప్పటికే భారీ బడ్జెట్ అయిపోవడంతో సహనం కోల్పోయిన విశ్వప్రసాద్.. నేను డబ్బులు పెట్టే పరిస్థితిలో లేను.. హీరో లేదా డైరెక్టర్ సొంత డబ్బులు పెట్టుకుని మిగతా షూట్ ని కంప్లీట్ చేసుకోండని చెప్పేశాడట. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ప్రభాస్ లాంటి ఆల్ ఇండియన్ స్టార్ సినిమా.. తుది దశకు చేరుకున్న సమయంలో.. డబ్బులు పెట్టనని ప్రొడ్యూసర్ నిరాకరించడం హాట్‌ టాపిక్ గా మారింది. అయితే.. ప్రాజెక్టుపై మొదటి నుంచి వినిపిస్తున్న రూమర్స్ అన్నింటినీ విశ్వప్రసాద్ ఖండిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన పైనే ఇంత పెద్ద వార్త వైరల్ అవ్వడంతో.. దీనిపై విశ్వప్రసాద్ ఎలా రియాక్ట్ అవుతాడు.. ప్రెస్ నోట్ విడుదల చేస్తాడా.. లేదా స్వయంగా ఆయనే మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.