టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా షూట్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. చిరంజీవి కెరీర్ లో చాలా రేర్ గా వచ్చిన జోనర్ కావడంతో.. ఇప్పటికే అందరిలోను ఆసక్తి మొదలైంది. కాగా.. దానికి తగ్గట్టు కామెడీ, లవ్, యాక్షన్ అన్ని ఎమోషన్స్ ను ఈక్వల్‌గా మిక్స్ చేసి సినిమాను చాలా కేర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార మెరవనుంది. ఈమెతో పాటే.. విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. చిరు, వెంకీ, నయన్ లాంటి భారీ స్టార్ కాస్టింగ్ కాంబో స్క్రీన్ పై ఎలా వర్కౌట్ అవుతుందో.. ఔట్పుట్ ఏ రేంజ్ లో ఆడియన్స్‌ను కట్టుకుంటుందో చూడాలి.
కాగా.. చిరంజీవి, వెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కూడా.. చాలా కాలం అవుతుంది. ఈ క్రమంలోనే సినిమా పై ఇప్పటికే మంచి ఆసక్తి మొదలయింది. ప్రస్తుతం.. సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అనిల్ ఎప్పటిలానే తనదైన స్టైల్ లో సినిమాను అతి తక్కువ సమయంలో పర్ఫెక్ట్ గా రూపొందించి.. చెప్పిన టైం కు రిలీజ్ చేసేలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక కేజీ అప్డేట్ వైరల్ గా మారుతుంది. టీం ఇప్పుడు ఫైనల్ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారని.. ఈ స్కెడ్యూల్‌తో సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయిపోతుందంటూ సమాచారం. హైదరాబాద్‌లో నిర్మించిన ప్రత్యేక సెట్‌లో ఈ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ రూపొందించనున్నారట.

ఇది సినిమాకు హైలెట్ గా మారిందని.. అంతేకాదు ఈ సీన్ కోసమే భారీ బడ్జెట్ కూడా కేటాయించారని సమాచారం. చిరంజీవి సైతం ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఫిట్నెస్ కాన్సెంట్రేట్ చేశాడట. ఇక ఈ యాక్షన్ సీన్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు వారం రోజులు సమయం పడుతుందని.. షూట్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులతో టీం బిజీ కానున్నారని తెలుస్తోంది. ఇక సినిమాకు బీమ్స్ సిసి రోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక షూట్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించిన వెంటనే సినిమాపై వరుస అప్డేట్స్ ను ఇచ్చేలా అనిల్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్టు గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెగాస్టార్ మరోసారి బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేయడం ఖాయమని.. సంక్రాంతి బరిలో విన్నర్ మెగాస్టార్ అంటూ.. మెగాస్టార్ కామెడీ టైమింగ్, అనిల్ క్రేజీ రైటింగ్ తోడైతే స్క్రీన్ పై నవ్వులు పూయడం ఖాయమని.. ఈ సినిమాతో రికార్డులు సృష్టిస్తారు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.


