” ఆంధ్ర కింగ్ తాలూకా ” ట్విట‌ర్‌ రివ్యూ.. ఈసారి కింగ్ రామే..!

తెలుగు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్‌ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాకు.. మహేష్ బాబు. పి దర్శకుడుగా వ్యవహరించారు. ఇక.. రామ్ నుంచి డబల్ ఇస్మార్ట్ లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన సినిమా ఇది. ఈ క్రమంలోనే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో మూవీ టీమ్ భారీ ప్రమోషన్స్ చేశారు. ఇక.. ఈ సినిమా కొద్ది గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇప్పటికే సినిమా ఓవర్సీస్ తో పాటు పలుచోట్ల ఫస్ట్ డే, ఫస్ట్ షోను కంప్లీట్ చేసుకుంది. దీంతో.. సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలను రివ్యూల ద్వారా షేర్ చేస్తున్నారు.

Andhra King Taluka Movie Review - U.S.A. Premiere Report

ఇంతకీ ఈ సినిమాతో రామ్ ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడు.. ఈసారైనా హిట్ కొట్టడా.. లేదో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా బాగుందని.. రామే ఈ సినిముకు కింగ్ అంటూ ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం అవుతున్నాయి. మహేష్.పి మరోసారి హార్ట్ ఫుల్ డ్రామని రూపొందించాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రన్ టైం కాస్త ఎక్కువే ఉన్నా.. ఫస్ట్ హాఫ్ కాస్త లాగ్ అనిపించినా సినిమా మాత్రం ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. ఆంధ్ర కింగ్ ఊహించిన‌ ఫ్యానిజం, లవ్ స్టోరీ.. ర‌న్ టైం ఎక్కువ ఉన్నా.. మంచి ఫీల్ కలుగుతుందంటూ మరొక నిటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

డైరెక్టర్ మహేష్ మంచి కంటెంట్ ఇచ్చాడని.. రామ్ నటన మెప్పించిందని.. ఇక సినిమాలో సూపర్ స్టార్ రోల్ కు ఉపేంద్ర సెలెక్ట్ చేయడం పర్ఫెక్ట్ డెసిషన్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఉపేంద్ర నటన అద్భుతంగా ఉందని.. ఊహకందేలానే కథ ఉన్న.. నిజాయితీగా కథను చూపించారని కామెంట్స్‌ చేస్తూన్నారు. చాలా మంచి స్టోరీ ప్రతి హీరో ఫ్యాన్ కూడా సినిమాకు కనెక్ట్ అయ్యేలా స్టోరీ ఉంది.. రైటింగ్ ఆకట్టుకుంది.. సెకండ్ హాఫ్ మెప్పిస్తుంది, మీనింగ్ ఫుల్.. హార్ట్ వార్మింగ్ స్టార్ ఫ్యాన్స్ స్టోరీ అంటూ మరోక‌రు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎమోషనల్ స్టోరీ ఇది.. రామ్‌ తన నటతో ఆకట్టుకున్నాడు. డైలాగ్స్, సాంగ్స్, సెకండ్ హాఫ్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కాస్త ల్యాగ్ అనిపించింది. ఓవరాల్‌గా ఆంధ్ర కింగ్ ఆకట్టుకున్నట్టు మరో పెటిజ‌న్‌.. 3రేటింగ్ ఇచ్చాడు. అలా ఇప్పటివరకు దాదాపు సినిమా నుంచి వచ్చిన రివ్యూస్ అన్ని రామ్ నటన పై.. క‌థ‌పై ప్రశంసలు కురిపిస్తూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.