టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ సుజీత్ పేరు గత కొద్ది రోజులుగా మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ పాత్రను సుజిత్ తీర్చిదిద్దిన తీరు చూస్తే ఇప్పటివరకు ఎవరు ఈ రేంజ్ లో పవన్ ను చూపించలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కత్తి పట్టడం, ఫైట్స్, గన్ షాట్ వాట్ నాట్.. అన్నింటినీ కవర్ చేస్తూ పవన్ స్టైల్ లోనే జానీ సోల్‌ను మిక్స్ చేసి సినిమాతో తన సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన రేంజ్ డబల్ అయిపోయింది. ఇక సుజిత్ ప్రజెంట్.. నేచురల్ స్టార్ నానితో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ప్రాజెక్టును అఫీషియల్ గా ప్రకటించారు. ఇక తన సహజనటనతో.. ఎలాంటి పాత్రనైనా అలోకగా నటించి మెప్పించగలడు.

ఈ క్రమంలోనే.. నేచురల్ స్టార్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇలాంటి క్రమంలో.. సుజిత్ – నాని కాంబో ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతుంది. సుజిత్ సినిమా విషయంలో నానికి ఓ క్రేజి ఆఫర్ ఇచ్చాడంటూ టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ క్రేజీ ఆఫర్ మరేదో కాదు.. హీరోయిన్లలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని ఆప్షన్ నానికే అప్పచెప్పేసాడట. అది కూడా.. నానికి రెండు ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. అందులో ఒకరు సాయి పల్లవి కాగా.. మరొకరు కీర్తి సురేష్. ఇక.. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అప్పటి నుంచే సాయి పల్లవి నటించనుందంటూ టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది.

కాగా ఈ సినిమా బలమైన నేచురల్ ఎమోషన్స్‌తో.. పవర్ఫుల్ స్టోరీగా తెరకెక్కుతుందని.. ఈ క్రమంలోనే సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి లేదా కీర్తి సురేష్ మాత్రమే సెట్ అవుతారని డైరెక్టర్ భావించాడట. ఇందులో భాగంగానే ఈ ఇద్దరిలో ఎవరైనా సెలెక్ట్ చేసుకోవడం నీ ఇష్టం.. నీకేమనిపిస్తుందో అదే ఫిక్స్ అని వివరించాడట. ఈ క్రమంలోనే నాని ఇతరుల ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలని సందిగ్ధతలో పడ్డాడంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. కీర్తి సురేష్.. నానికి బెస్ట్ ఫ్రెండ్. అలాగే.. కెమిస్ట్రీ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. మరోవైపు సాయి పల్లవి – నాని కాంబో అంటే బ్లాక్ బస్టర్ కాంబో. ఇప్పటికే వీళ్ళిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు తెరకెక్కి రెండు సూపర్హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే.. వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచనలో నాని పడిపోయాడట. ఇక ఫైనల్ గా నాని ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో.. ఇద్దరిలో ఎవరిని హీరోయిన్లుగా సెలెక్ట్ చేస్తాడో వేచి చూడాలి.

