తమిళ్ సూపర్ స్టార్ విజయ్ దళపతికి ఉన్న క్రేజ్, పాపులార్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొలువుడు ఇండస్ట్రీలో తన నటనతో లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయ్.. తాజాగా.. రాజకీయ పార్టీ స్థాపించి పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన ఏర్పాటు చేసిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో ఎంతోమంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే.. స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. విజయ్‌పై ఫైర్ అయింది. ఆయన్ని జోకర్ తో పోలుస్తూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా కరూర్ తొక్కిసలాటలో 41 మంది తమ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.
ఇక ఈ ఘటనపై పరోక్షంగా శృతిహాసన్ రియాక్ట్ అవుతూ.. జోకర్ సర్కస్ కు వెళ్లడం వల్లే గోరం జరిగిందని.. తన ఇన్స్టా వేదికగా పోస్ట్‌ను షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ఒక జోకర్ గానే ఆయన నడుచుకుంటారని.. అందువల్లే ఆయన్ని తప్పు పట్టకూడదంటూ వెల్లడించింది. సర్కస్‌కు వెళ్లిన వారిని వేలెత్తి చూపాలని.. ఆమె కామెంట్స్ చేసింది. అయితే.. ఈ పోస్ట్ చేసిన కాసేపటికి దాన్ని తొలగించిన.. అప్పటికి శృతిహాసన్ చేసిన పోస్ట్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.
ఇక కరూర్ దుర్ఘటనలో మృతి చెందిన కొంతమంది కుటుంబాలను విజయ సోమవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జరిగిన నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది.. కానీ జీవితాంతం తాను అండగా ఉంటానని.. విజయ్ ఓదార్పు ఇచ్చాడు. అయితే.. విజయ్ మరియు శృతిహాసన్ జంటగా గతంలో పులి సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. కాగా ఈ సినిమా షూట్ టైంలోనే.. వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏమైనా ఏర్పడి ఉంటాయని.. దీంతో శృతిహాసన్ టైం చూసి విజయ పై ఇలాంటి హాట్ కామెంట్స్ చేసిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుడంతో దీనిపై విజయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.