దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్ట్ నోటీసులు.. నవంబర్ 14న హాజరవ్వాల్సిందే

తాజాగా దగ్గుబాటి ఫ్యామిలీ ఓ వివాదంలో చిక్కుకున్నారు.హైదరాబాద్ ఫిలింనగర్‌లో దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కాంట్రవర్సీకి సంబంధించిన కేసులో తాజాగా.. దగ్గుపాటి వెంకటేష్, రానా, అభిరామ్‌, నిర్మాత సురేష్ బాబు లకు నాంపల్లి కోర్ట్ కీలక నోటీసులు అందించింది. ఇక నేడు ఈ కేసు విచారణ జరిపిన కోర్ట్‌.. నవంబర్ 14న తదుపరి విచారణ ఉండ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

Hyderabad: Poachgate accused's hotel in Jubilee Hills partly demolished | Hyderabad News - Times of India

కచ్చితంగా వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబులు హాజరు కావాలంటూ క్లారిటీ ఇచ్చింది. వ్యక్తిగత పూచికత్తు సమర్పించాల్సి ఉందని.. ఈ నలుగురు మళ్ళీ కోర్టుకు వ‌చ్చి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాల్సిందేన‌ని తీర్పునిచ్చింది. కోర్ట్ ఆదేశాలను ధిక్కరించి మరీ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్ చేశారని ఆరోపణలు నేపథ్యంలో వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ లపై గతంలో కేసు నమోదయింది.

Rana's brother Abhiram to tie the knot today - Teluguodu

తాజాగా ఈ కేసు ఇన్వెస్టిగేష‌న్లో భాగంగా.. కచ్చితంగా వీళ్ళ నలుగురు కోర్టుకు రావాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కేసు నేప‌ద్యంలో ద‌గ్గుబాటి ఫ్యామిలి ఎంకెన్ని సార్లు కోర్ట్ మెట్లు ఎక్కాల్సి వ‌స్తుందో.. ఈ కాంట్ర‌వ‌ర్సీ ఎప్ప‌టికి ముగుస్తుందో చూడాలి.