కోలీవుడ్ హీరో రిషబ్ శెట్టి నుంచి మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన కాంతార.. ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్‌ను సైతం మంత్రముగ్ధులరు చేయడమే కాదు.. ఆడియన్స్‌లో గూస్‌బంప్స్ తెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాకు ఫ్రీక్వల్ గా కాంతర చాప్టర్ 1 రిలీజ్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా.. తానే డైరెక్షన్ వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ మెరవగా.. జయరాం, గుల్జాన్ దేవ్ ప్రధాన పాత్రలో నటించారు. హంబాలే ఫిలింస్ బ్యానర్ పై కన్నడలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. ఇక నేడు అక్టోబర్ 2న గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే చాలా చోట్ల నిన్న రాత్రి సినిమా ప్రీమియర్స్ వేసేసారు. ఈ క్రమంలోనే కాంతారకు ఉన్న క్రేజ్ తో ఈ సినిమా ధియేటర్లు కళకళలాడాయి. భారీ అంచనాల నడుమ ఆడియన్స్‌ను పలకరించిన ఈ మూవీ.. కాంతార మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేసిందా.. లేదా.. ఈ సినిమాతో రిషబ్ హిట్ కొట్టాడా.. ఒకసారి చూద్దాం.
స్టోరీ:
కాంతర కథ ముగిసిన చోట.. చాప్టర్ 1 స్టార్ట్ అయింది. క్లైమాక్స్‌లో నాన్న మాయమైనప్పుడు.. కొడుకు అడిగే ప్రశ్నతో చాప్టర్ 1 ప్రారంభించారు. కథ కొన్ని శతాబ్దాల వెనక్కు వెళ్లి.. రాజుల కాలంనాటి రాజ్యాల కథలోకి వెళ్ళింది. బాంగ్లా రాజ్యాన్ని ఆనుకుని ఉండే అడవి ప్రాంతమే ఈ కాంతార. ఈశ్వరుడి పూదోట అని కూడా పిలుస్తుంటారు. ఈశ్వరుడి పోదోట సుగంధ ద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్. ఆ ఏరియా మొత్తానికి కాపలాగా బ్రహ్మ రాక్షసుడు ఉంటాడని ఓ కథ ఉంది. అది వాస్తవమా.. కట్టు కథ తేల్చడానికి వెళ్లిన బాంద్రా రాజు దారుణంగా చనిపోతాడు. ఇక తండ్రి చావును కళ్ళారా చూసినా యువరాజు.. (జయరామ్) పెరిగి పెద్దవాడై.. రాజస్థానంలో నిలుస్తాడు. కానీ.. తన పిల్లలకు కాంతార వైపు పోవద్దు.. అక్కడ ఓ బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడని హెచ్చరిస్తూ ఉంటాడు.
ఇక తనకు వయసు అయిపోయిన తర్వాత తనయుడు కులశేఖర్ (గుల్షన్ దేవయ్య)కు రాజా పట్టాభిషేకం జరుగుతుంది. కులశేఖర్ ఒక మూర్ఖుడు. తండ్రి చేయొద్దని చెప్పిన పనులనే చేస్తూ ఉంటాడు. తన మూర్ఖత్వంతో కాంతరపై కాలు మోపుతాడు. ఈ క్రమంలోనే అనర్ధాలు మొదలయ్యాయి. కాంతరకు కాపలాగా బర్మే (రిషబ్ శెట్టి) వ్యవహరిస్తాడు. ఇక ఆయనకు ఖండ బలమే కాదు.. దైవబలం కూడా తోడై.. కాంతరకు రక్షణ కవచంగా ఉంటాడు. ఈ క్రమంలోనే అక్కడ పండే పంటని బందరు తీసుకెళ్లి వ్యాపారం చేయాలని భావిస్తాడు. అందుకు యువరాణి 9రుక్మిణి వసంత్) ఒప్పుకుంటారు. ఇక బాంద్రాలో కాంతార అసలు వ్యాపారం చేయడం యువరాజుకు నచ్చదు. దీంతో మళ్ళీ ఆ ప్రాంతంపై పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. ఇంతకీ తర్వాత ఏం జరిగింది.. కాంతరిని బ్రహ్మ రాక్షసుడు రక్షిస్తాడు.. ఆ కథ నిజమేనా.. ఆ ప్రాంతంలో ఉన్న అసలు శక్తి ఏంటి.. అది ఎప్పుడు రివిల్ అవుతుంది.. దుర్మార్గం, దురాశ చెలరేగిన సమయంలో కాంతార ప్రజలకు దైవబలం ఎలా అండగా నిలిచింది.. అనేది థియెటర్స్‌లో చూడాల్సిందే.
రివ్యూ:
కాంతార చూసిన ప్రతి ఒక్కరికి కథ గుర్తుండే ఉంటుంది. దురాశతో అక్కడ స్టోరీ మొదలవుతుంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని ఆశపడ్డ వాళ్లకు ప్రకృతి, దైవం ఎలాంటి శిక్ష విధించింది అనేది కథ. ఇప్పుడు కాంతర చాప్టర్ 1 సైతం అలాంటి కథతోనే తెరకెక్కింది. ఈశ్వరుడి పూదోటపై ఆశపడిన వాళ్ళను.. ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూసే దుర్మార్గులను.. కాంతారలో కొలువైన దైవం ఎలా నాశనం చేసిందనేదే స్టోరీ. మొదటి భాగంలో ఏ రేంజ్ లో అయితే స్టోరీ, మ్యూజిక్, బ్యాక్ డ్రాప్, అడవిలో దైవీక శక్తి కనిపించేలా చేసి ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించారో.. క్లైమాక్స్‌లో విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారో.. అదే తరహాలో కాంతార కూడా ఉన్న ఫీల్ కలిగింది. ప్రారంభంలో.. కాంతర ప్రపంచంలోకి తీసుకు వెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నాడు. కాంతార వాసులు.. బందరు వచ్చి బిజినెస్ చేయాలనుకోవడంతో.. కథ ట్రాక్‌లో పడినటకలు అనిపించింది.
ఇక సినిమాకు రథం ఫైట్ హైలైట్. యువరాజ్ కులశేఖర్ పాత్ర అతని పనులు అక్కడక్కడ ఫన్నీగా అనిపిస్తాయి. చాలా వరకు సినిమాపై మాత్రం ఇంపాక్ట్ లేదు. ఇతను చేతుల్లో కాంతారకు ఎదో హాని జరుగుతుందన్న భయం ఆడియన్స్ లో క్రియేట్ చేయలేకపోయారు. యువరాణితో లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకోలేదు. కాంతార చూసిన వాళ్లు.. కాంతార చాప్టర్ 1 చూస్తే ప్రతి ఒక్క సీన్ యావరేజ్ గా అనిపిస్తుంది. అసలు ఇది కాంతారావు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు ఫ్రీక్వెల్ ఏనా అనే ఫీల్ ఆడియన్స్ లో కలుగుతుంది. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్‌కు రిషబ్ మళ్లీ కథను ట్రాక్ లో పెట్టాడు. మంచి పట్టు తెచ్చుకున్నాడు. ఆ టైంలో వచ్చే ఫైట్స్ ఆడియన్స్ కచ్చితంగా ఆకట్టుకుంటాయి. అడవిలో పులి ఎంట్రీ తోనే కథ కాస్త ట్రాక్ లోకి పడుతుంది. కేవలం ఒక్క ఇంటర్వెల్ ఫైట్ కాదు.. దాదాపు సినిమాలో అన్ని ఫైట్లు ఆడియన్స్ను ఆకట్టుకునేలానే ఉన్నాయి. రిషబ్ శెట్టి కష్టం కనిపించింది. ఇక ఎంట్రీ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక సెకండ్ హాఫ్ లో రిషబ్ చాలా కథలున్న ఆడియన్స్‌ను కన్ఫ్యూజ్ చేయకుండా కనెక్ట్ అయ్యేలా చూపించే ప్రయత్నాలు చేశాడు.
కానీ దేనికి పెద్దపీట వేయాలో అర్థం కాని పరిస్థితి. ఓవైపు బాంగ్రా రాజు, మరోవైపు కాంతార కథ, ఇంకోవైపు నార్త్ సైడ్ ఉన్న వాళ్ల స్టోరీ, శివుడి ఆలయం ఎపిసోడ్.. ఇలా ఇన్ని ఫార్ములాలు ఒకేసారి చూపించాల్సిన పరిస్థితి. ఇవన్నీ వెంట వెంటనే చూపించాడు. కాంతార మొదటిసారి చూసినప్పుడు ఆడియనస్‌లో గూస్ బంప్స్ వచ్చాయి. అదే ఇంపాక్ట్.. చాప్టర్ 1 విషయంలో కూడా కనిపిస్తుంది. మనుషుల్ని బట్టలు ఉతికినట్లు ఉతికేయడం, గాలిలో ఎగరేసి మరి కొట్టడం.. ఇవన్నీ ఎక్కడ ఆర్టిఫిషియల్ గా అనిపించలేదు. చాలా.. న్యాచురల్ గా అతికినట్లు కనిపించాయి. దైవ మహిమ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది గా అనేలా సీన్స్ ఉన్నాయి.
కాంతారను క్లైమాక్స్ నిలబెట్టినట్టే.. కాంతార చాప్టర్ 1ను కూడా క్లైమాక్స్ కాపాడింది అనడంలో అతిశయోక్తి లేదు. వార్ ఎపిసోడ్ కోసం చాలా కష్టపడ్డారు. యాక్షన్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంది. కానీ.. అక్కడ కూడా చిన్నచిన్న పంచులు విసరాలని చూడడం మాత్రం ఆడియన్స్ కు కాస్త డిసప్పాయింట్మెంట్. క్లైమాక్స్ లో దాదాపు 20 నిమిషాల పాటు విధ్వంసం సృష్టించారు. శివుడి దర్శనం, బ్రహ్మ రాక్షసుడు తో ఫైట్.. చివర్లో మళ్ళీ గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. వీటన్నింటికీ తోడు.. చాముండి అవతారం దర్శనం పీక్స్ లెవెల్ లో ఉంది. పులితో పాటుగా రిషబ్ పరిగెడుతున్న సీన్.. టికెట్ కాస్ట్‌కు వర్త్ అనిపించింది. కాంతార అంతా చూశాక ఇందులో చూడడానికి కొత్త కథ ఏముంటుంది అన్న ఫీల్ అస్సలు లేదు.
నటీ నటుల పర్ఫామెన్స్:
రిషబ్ శెట్టి ప్రతి సీన్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. క్లైమాక్స్‌లో మళ్ళీ రిషబ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తాను తప్ప ఈ పాత్రకు మరెవ్వరు సెట్ కారేమో అనేంతలా నట విద్ధ్వంశం చూపించాడు. యాక్షన్ సీన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. ఇక రుక్మిణి వసంత్ తెరపై అందంతో ఆకట్టుకుంది. ప్రారంభంలో యువరాణి మనస్తత్వానికి తగ్గట్టుగా పాత్ర సాగలేదు అనిపించిన.. చివర్లో మాత్రం ఆ ఆర్క్ కనిపించింది. ఇక జయరాం తన గతాన్ని అనుభవాన్ని రంగరించి చెప్పడం పెద్దగా ఆడియన్స్‌కు కనెక్ట్‌లేదు. ఆయనకంటే ఇంకా బాగా నటించే వాళ్ళు చాలా మంది ఉన్నారనే ఫీల్ ఆడియన్స్‌లో కలుగుతుంది. కులశేఖర్ పాత్ర కూడా దాదాపు ఇదే పరిస్థితి. రోల్ పోషించే వ్యక్తిని బట్టి క్యారెక్టర్‌లో ఉండాల్సిన సీరియస్‌నెస్ మరింతగా కనిపిస్తుంది. ఆ ఇంపాక్ట్ ఈ రెండు పాత్రల్లో కనిపించలేదు.
టెక్నికల్ గా
ఇక టెక్నికల్గా అసలు.. ఏ వంకాలేదు. అన్ని విధాలుగా ఆకట్టుకుంది. జంగిల్ బ్యాక్ డ్రాప్ తెరపై చాలా అందంగా.. సహజంగా చూపించారు. ఆర్ట్, కెమెరా, ప్రొడక్షన్.. ఇలా ప్రతి ఒక్క విభాగం 100% ఎఫర్ట్స్ కనిపించాయి. యాక్షన్ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్. సౌండ్ డిజైనింగ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. కాంతార వారాహ రూపం సాంగ్ ఈ సినిమాలోను వాడారు. ఈ సాంగ్లో దైవత్వం ఉట్టిపడేలా ఉంది. కాంతార లానే.. కాంతర చాప్టర్ 1 లోను రిషబ్ శెట్టి క్లైమాక్స్ ని నమ్ముకున్నాడు. ఆ 20 నిమిషాలు సినిమా స్థాయిని మరో లెవెల్ కు తీసుకువెళ్ళింది. మరోసారి మ్యాజిక్ను రిషబ్ రిపీట్ చేశాడా అంటే మాత్రం నో అని చెప్పాలి. కానీ.. సినిమాకు మాత్రం న్యాయం జరిగింది.
ఫైనల్ గా :
కాంతారని దృష్టిలో పెట్టుకుని వెళితే ఏమో కానీ.. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయవచ్చు.
రేటింగ్:3.5/5