కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి.. కాంతార చాప్టర్ 1 లేటెస్ట్‌గా రిలీజై.. బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. సౌత్‌తో పాటు.. ఈ సినిమా నార్త్ లోను సత్తా చాటుకుంటుంది. విదేశాల్లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా హైయస్ట్ కలెక్షన్లు కల్లగొట్టిన రెండో సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. మొదటి స్థానంలో కేజిఎఫ్ 2 నిలవగా.. 2వ స్థానంలో కాంతర చాప్టర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. త్వరలోనే.. కేజిఎఫ్ రికార్డులను బ్రేక్ చేయడానికి కాంతర సిద్ధమైంది.
సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం.. ఈ సినిమా వారం రోజుల్లో రూ.410 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టినట్లు తెలుస్తుంది. కాంతార ఫస్ట్ పార్ట్ ఫుల్ రన్ లో.. రూ.408 కోట్ల వసూళ్లను కొల్లగొట్టగా.. వారం రోజుల్లోనే ఈ రికార్డ్ ను బ్రేక్ చేసింది. ఇప్పుడు.. రూ.1000 కోట్లు కొల్లగొట్టే టార్గెట్ తీసుకురా సినిమా పరుగులు తీస్తుంది. ఇప్పటికే కేజీఎఫ్ 1.. రూ.238 కోట్ల ఫుల్ రన్ కలెక్షన్ రికార్డును అలాగే.. కాంతార ఫస్ట్ పార్ట్ రికార్డును బ్రేక్ చేసిన కాంతార చాప్టర్ 1.. నెక్స్ట్ కేజీఎఫ్ 2 రికార్డును పటాపంచలు చేయనుంది.
ఈ రికార్డును బ్లాస్ట్ చేయగలిగితే మాత్రం.. కన్నడలో యష్‌ను మించి పోయే రేంజ్ లో రిషబ్ శెట్టి ఇమేజ్ను సొంతం చేసుకోవడం ఖాయం. ఇక.. ఈ వీకెండ్‌లో కలెక్షన్ల పరంగా కన్సిస్టెన్సీ చూపిస్తూ దూసుకుపోతుంది. ఇదే రేంజ్‌లో వారాంతం వరకు కలెక్షన్లు కొనసాగితే.. మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ ఇప్పటికీ మంచి రెస్పాన్స్ని దక్కించుకుంటుంది. ఇక ఫ్యూచర్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందా.. కేజీఎఫ్ చాప్టర్ 2 టార్గెట్ ను బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.