టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన సీక్వెల్స్ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో కల్కీ 2898 ఏడీ సినిమా సైతం ఒకటి. ఈ సినిమా సీక్వెల్‌పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా చాలంటు ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. తాజాగా సినిమా సీక్వెల్ కు సంబంధించిన అద్భుతమైన లీడ్‌ను నాగ అశ్విన్ రివిల్ చేశాడు. దీన్ని ఎలా మొదలుపెట్టనున్నారు.. ఎలా ముగించనున్నారు అనే విషయంపై ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే నాగ అశ్విన్ షేర్ చేసుకునే అప్డేట్ నెట్ దగ్గర వైరల్ గా మారుతుంది. కల్కి 2898ఏడీ సినిమాలో కర్ణుడి పాత్ర పై సినిమాను ముగించిన అశ్విన్.. రాబోతున్న సీక్వెల్లో కూడా కర్ణుడి పాత్రనే ప్రధానంగా చూపించనున్నడట. అందుకే.. సీక్వెల్‌కు కర్ణ 3102 బిసి అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కలియుగంలో భైరవలా మహాభారతంలోని కర్ణుడే జన్మించాడని.. మొదటి భాగంలో చూపించారు. మరి.. సెకండ్ పార్ట్ లో కర్ణుడి పాత్ర ఏమై ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

సుప్రీమ్ హస్కిన్ (కమల్ హాసన్) అత్యంత బలవంతుడిగా మారాడు. కర్ణుడుగా (ప్రభాస్), అశ్వద్ధామ (అమితాబ్) కలిశారు. ఇక యుద్ధం తప్పనిసరి. మరి.. ఇది ఏ రేంజ్ లో ఉండబోతుంది.. ఎవరి పాత్రలు ఎంత పవర్ఫుల్ గా అశ్విన్ ఆడియన్స్‌కు చూపిస్తాడని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇలాంటి క్రమంలో.. దీపికా పదుకొనేను సినిమా నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆమె ప్లేస్ లో అనుష్క, రుక్మిణి వసంత్, ప్రియాంక చోప్రా.. ఇలా చాలామంది పేర్లు వైరల్ గా మారుతున్నాయి. ఫైనల్ గా ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి.

