కాంతార కోసం ఫస్ట్ ఆ తెలుగు హీరోతో అనుకున్నారా.. ఈ లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?

సౌత్ సినీ ఇండస్ట్రీలోనే అత్యున్నతమైన హిస్టారికల్ సినిమాలలో కాంతారా కచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. రిషబ్ శెట్టి హీరోగా.. తనే దర్శకత్వం వహిస్తూ రూపొందించిన ఈ సినిమా మొదట ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైనా.. రూ. 400 కోట్ల గ్రాస్‌ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 సైతం ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే.. మూడు రోజుల్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వ‌సుళ్ల‌ను కొల్లగొట్టి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. రాబోయే రోజుల్లో.. సినిమా మరిని భారీ కలెక్షన్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే కాంతార సెట్స్ పైకి రాకముందు జరిగిన కొన్ని సంఘటనలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.

మొదట ఈ సినిమాకు హీరోగా చేయాలని రిష‌బ్ శెట్టి అసలు భావించలేదట. తను డైరెక్టర్‌గా ఓ టాలీవుడ్ స్టార్ హీరోను పెట్టి తీయాలని భావించాడట. అ హీరో మరెవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. రిషిబ్ శెట్టికి ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే.. చాలా సందర్భాల్లో అది రిజిల్ అయింది. కానీ.. అదే టైంలో ఆర్‌ఆర్ఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం.. నెక్స్ట్ సినిమా దేవర‌కి కూడా డేట్స్ ఇచ్చేయడంతో.. కాంతార వదులుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఎన్టీఆర్ సినిమాను ఒప్పుకొని చేసి ఉంటే మాత్రం కచ్చితంగా మాస్ ఆడియన్స్ లో హైప్ నెక్స్ట్‌ లెవెల్‌లో ఉండేది.

కాగా.. ఈ క్రమంలోనే రిషబ్ శెట్టి తన సినిమాకు తానే హీరోగా చేయాల్సి వచ్చింది. ఇక తన సినీ కెరీర్‌లోనే మొదటి సినిమాతో హీరోగా నేషనల్ అవార్డును సైతం దక్కించుకున్నాడు రిషబ్. అదే ఎన్టీఆర్ లాంటి అనుభవం ఉన్న హీరోను సినిమాలో నటింప చేసి ఉంటే.. సినిమా రేంజ్ మరింత పెరిగేది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం న్యూస్ నెట్టింట‌ తెగ వైరల్ గా మారడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బంగారం లాంటి ఛాన్స్‌ను మిస్ అయ్యాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తారక్‌కు మొదటి నుంచి కర్ణాటక ప్రాంతంలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలోని ఎన్టీఆర్ ఒప్పుకొని సినిమాలో నటించి ఉంటే అక్కడ ఆడియన్స్ లో సినిమా ఎవ్వరూ ఊహించని రేంజ్ కు వెళ్ళేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.