స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను నటించింది అతి తక్కువ సినిమాలే అయినా.. ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకొని గోల్డెన్ బ్యూటీ ట్యాగ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఈమె ఎంచుకునే కథలు విషయంలోనూ.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రజెంట్ జనరేషన్ లో అత్యంత తెలివైన సెలెక్టివ్ హీరోయిన్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. భీమ్లా నాయక్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. బింబిసారా, సార్, విరూపాక్ష లాంటి సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకుంది. కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ వరుస సినిమాల్లో.. నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది.
పాన్ ఇండియన్ మార్క్ క్రియేట్ చేసుకుంటుంది. ఇక ప్రస్తుతం అమ్మడి చేతిలో ఉన్న టాలీవుడ్ సినిమాల లిస్ట్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. బాలయ్య అఖండ 2తో పాటు.. స్వయంభు, నారి నారి నడుమ మురారి, పూరి – విజయ్ కాంబో ప్రాజెక్టులు సైతం అమ్మడి చేతిలో ఉన్నాయి. కాగా.. ఇలాంటి క్రమంలో సంయుక్త తీసుకున్న డెసిషన్ అందరికి షాక్‌ను కలిగిస్తుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటల్ సినిమాలనే గానే అనుష్క, నయనతార పేర్లు గుర్తుకొస్తాయి. ఆరెంజ్ లో తమ పర్ఫామెన్స్ తో ఆడియన్స్ను ఆకట్టుకున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఇప్పటివరకు.. మళ్ళీ వీళ్ళిద్దరి రేంజ్ లో లేడి ఓరియంటెడ్ సినిమాలతో ఆ రేంజ్‌లో క్రేజ్‌ఎవరు అందుకోలేక పోయారు. ఇలాంటి క్రమంలో.. తాజాగా సంయుక్త మీనన్ లేడీ ఓరియంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఈ సినిమాల్లో.. అమ్మడు పవర్ఫుల్ పాత్రలో మెరవనుందని అంటున్నారు. నయనతార, అనుష్క రికార్డులను మించిపోయే లెవెల్లో.. ఈ సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకొనుందని సమాచారం. చింతకాయల రవి సినిమాకు దర్శకుడుగా వ్యవహరించిన డైరెక్టర్ యోగి.. ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. బ్లాక్ గోల్డ్ అని ఇంట్రెస్టింగ్ టైటిల్ని కూడా ఫిక్స్ చేశారట. అంతేకాదు.. సినిమా షూట్ మొదలై 50 శాతం పార్ట్ కంప్లీట్ కూడా అయిపోయిందని.. ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ నడుస్తుంది. కాగా.. ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం సంయుక్త.. బ్లాక్ గోల్డ్ సినిమాతో మరో బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నయనతార, అనుష్క రేంజ్‌ను టచ్ చేస్తుందని చెప్తున్నారు. ఫ్యాన్స్ లో ఉన్న ఈ నమ్మకాన్ని.. సంయుక్త నిలబెడుతుందా.. లేదా.. ఈ సినిమాతో అమ్మడి కెరీర్ ఎలాంటి మలుపు తీసుకోబోతుందో వేచి చూడాలి.