సంక్రాంతికి వస్తున్నాంతో సాలిడ్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న వెంకీ.. ఇప్పుడు త్రివిక్రమ్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో వెంకీ నటించిన.. ఆయన కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాలు అయిన.. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రచయిత అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వెంకీని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు త్రివిక్రమ్.
ఎప్పటినుంచో వీళ్లిద్దరు కాంబోలో సినిమా రావాలన్న ఫ్యాన్స్ కోరిక ఎట్టకేలకు నెరవేరనుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాను త్రివిక్రమ్.. కామెడీ పంచ్‌లతో అదిరిపోయే కథనాలతో తెరకెక్కించనున్నట్లు సమాచారం. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టితోపాటు పలు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇక ఫైనల్ గా హీరోయిన్ గా కన్నడ యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి ని ఫిక్స్ చేశారట మేకర్స్. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నారు.
హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర చినబాబు ప్రొడ్యూసర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాకు వెంకటరమణ క్యారఫ్ ఆనంద్ నిలయంతో పాటు.. అలివేలు వెంకటరత్నం టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు టాక్. ఈ నెల చివరి వారంలో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు టీం. అలాగే.. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతమ అందించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఆడియన్స్‌లో నవ్వులతో ముంచేయడం ఖాయమని.. వెంకీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్క అంటూ టాక్ నడుస్తుంది.