అనుష్కతో రానా ఫోన్ ఇంటర్వ్యూ.. అప్పటినుంచి వరుస సినిమాలో చేస్తా అంటూ..

స్టార్ హీరోయిన్ అనుష్క ఎలాంటి పాత్రలో అయినా నటించి ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవడంలో దిట్ట. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో రేంజ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సైతం సత్తా చాటుకుని ఇప్పుడు మరోసారి ఘాటు కంటెంట్‌తో.. భిన్నమైన స్టోరీ తో ప్రేక్షకులు పలకరించేందుకు సిద్ధమవుతుంది. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. సెప్టెంబర్ 5న ఆడియన్స్‌ను పలకరించనుంది. చింతకింద శ్రీనివాసరావు కథ‌ అందించిన ఈ సినిమా.. ప్రమోషన్స్ లో ప్రస్తుతం మేకర్స్ బిజీబిజీగా గ‌డునుతున్నారు.

అయితే.. అనుష్క సైతం ప్రమోషన్స్‌లో ఆన్ స్క్రీన్ పై కనిపించుకున్నా.. ఆఫ్ స్క్రీన్ లో సందడి చేస్తుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా నటుడు రానా.. ఆమెతో ఫోన్ కాల్ లో ఇంటర్వ్యూ చేయగా.. అందులో అనుష్క ఘాటి విశేషాలను షేర్ చేసుకుంది. ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్‌లో ఈ సినిమా షూట్ జరిగిందని.. బాహుబలి, అరుంధతి తర్వాత వరుసలో కచ్చితంగా ఘాటి నిలుస్తుంది అంటూ వివరించింది. ఇందులోని వైలెన్స్ పక్కన పెడితే.. కథ ఇప్పటి సొసైటీలో పరిస్థితులకు బాగా సెట్ అవుతుంది.. క్రిష్ నాకు ఎప్పుడు గొప్ప పాత్రలే అందిస్తాడు.. వేదంలో సరోజ చాలా సున్నితమైన పాత్ర.. దాన్ని ఆయన ఎంతో గొప్పగా చూపించాడు. నా కెరీర్‌లో గుర్తుండిపోయే రోల్స్‌లో అది కూడా ఒకటంటూ వివరించింది.

ఇప్పుడు ఘాటిలో శీలావతి కూడా అలాంటి ఇమేజ్ ద‌క్కించుకుంద‌ని చెప్పుకొచ్చింది. ఇక రానా మాట్లాడుతూ.. ఇకపై ఇలాగే మూడు ఏళ్లకు ఒక సినిమా చేస్తావా.. నిన్ను కలిసి దాదాపు పదేళ్ల అవుతుందని ప్రశ్నించగా.. దానికి స్వీటీ నవ్వుతూ సమాధానం చెప్పింది. మంచి స్క్రిప్ట్ లో సెలెక్ట్ చేసుకుంటున్నా.. వచ్చేయడాది నుంచి వరుసగా సినిమాలు చేస్తా. అలాగే.. అందరి ముందుకు కూడా వస్తా. మా ఇళ్ళలో జరిగే పెళ్లిళ్లకు కూడా వెళ్లడం లేదు. అందరూ ఎప్పుడు కనిపిస్తావు అని నన్ను అడుగుతున్నారు. త్వరలోనే అందరికీ కనిపిస్తా అంటూ వివరించింది. ఇక ఘాటిని యాక్సెప్ట్ చేసినప్పుడే సినిమా ప్రమోషన్స్ లో మాత్రం నేను పాల్గొనాలని అనుష్క చెప్పేసినట్లు నిర్మాత తాజాగా ఈవెంట్లో క్లారిటీ ఇచ్చారు.