ఘాటి ప్రమోషన్స్: యాక్షన్ సినిమాలకు అనుష్కనే ఎందుకు.. రానా ప్రశ్నకు స్వీటీ షాకింగ్ రిప్లై..!

అనుష్క శెట్టి ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరో రేంజ్ లో క్రేజ్‌ సంపాదించుకున్న అనుష్కను ముద్దుగా ఫ్యాన్స్ స్వీటీ అని పిలుచుకుంటారు. ఇక గత కొంతకాలంగా అనుష్క చాలా తక్కువ సినిమాలను మాత్రమే ఎంచుకుని నటిస్తున్న సంగతి తెలిసిందే. అలా.. ప్రస్తుతం అమ్మడు నటించిన లేటెస్ట్ మూవీ ఘాటి. ఈ సినిమాతో త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ మూవీ మరో రెండు రోజుల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో టీమ్ సంద‌డి చేస్తున్నారు. ఇక అనుష్క ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో, ఈవెంట్లలో పాల్గొనకపోయినా.. ఇన్ డైరెక్ట్ గా సినిమాకు ప్రమోట్ చేస్తూనే ఉంది.

Anushka To Rana Daggubati Over A Phone Call About Ghaati

ఈ క్రమంలోనే తాజాగా పాన్ ఇండియన్ స్టార్ యాక్టర్ రానాతో ఫోన్ ఇంటర్వ్యూలో సందడి చేసింది. సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు.. తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సైతం పంచుకుంది. ఇంటర్వ్యూలో భాగంగా అనుష్క.. మీరు ఎప్పుడు ఇలాంటి పవర్ఫుల్ పాత్రలు ఓందుకు ఎంచుకుంటారు అనే ప్రశ్నకు న‌వ్వుతూ రియాక్ట్ అయ్యింది. అది నాకే తెలియదు రానా. నేనే దాని గురించి ఆలోచిస్తున్నాను అంటూ వివరించింది. అంతేకాదు.. తన సినిమాల్లో హింసాత్మక సన్నివేశాల గురించి సరదాగా చెప్పుకొచ్చింది. అరుంధతి, బాహుబలి.. ఇప్పుడు ఘాటి ఈ సినిమాల్లో హింస చాలా ఎక్కువగా ఉంటుందని.. ఈ విషయం గురించి నేను డైరెక్టర్ కృష్‌తో కూడా చెప్పానంటూ వివరించింది. ఒక హిట్ మ్యాన్‌లా.. తాను ఒక హిట్ వుమన్‌గా మారిపోగలనేమో అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేసింది.

Anushka Shetty's Ghaati Gets U/A, Censor Buzz Hails Her Career-Best  Performance - ManaTelugu

దానిపై రానా రియాక్ట్ అవుతూ ఇలాంటి కథలకు అన్నీ మిమ్మల్ని కాకుండా.. ఇంకెవరిని తీసుకుంటారు అంటూ ప్రశ్నించాడు.. ప్రస్తుతం ఈ కాన్వర్జేషన్ అంత యాక్షన్ సినిమాల్లో అనుష్కకు ఉన్న క్రేజ్ ఏంటో.. దర్శక, నిర్మాతల్లో ఉండే నమ్మకం ఏంటో తెలియజేస్తుంది. ఇక యాక్షన్ సినిమాలతో అనుష్క ఇంతటి క్రేజ్ ను దక్కించుకున్న సినిమా.. సినిమాకు లాంగ్ గ్యాప్ ఇస్తూ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అనుష్క సినిమాలకు ఇలా లాంగ్ గ్యాప్ పై చర్చ హాట్‌ టాపిక్ గా మారింది. దీనిపై అనుష్క రియాక్ట్ అయింది. నిజంగానే నేను ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి.. మంచి కథలు తీసుకోవాలి.. మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నా.. వచ్చే సంవత్సరం నుంచి వరుస సినిమాల్లో చేస్తా అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక వీళ్లిద్ద‌రి మధ్యన కాన్వర్జేషన్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. డ్రగ్స్ మాఫియాకు వ్యతిరేకంగా ఓ సమాజం సాగించే తిరుగుబాటు కథాంశం సినిమా రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.