పెద్ది సినిమాను వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్.. చరణ్ బ్రేక్ చేయగలడా..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. అదే ట్రైన్ ట్రాక్ ఎపిసోడ్. ఈ విషయంలో ఎప్పటినుంచో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. గతంలో.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన వినయ విధేయరామ మూవీలో ట్రైన్ ట్రాక్ మీద ఓ సీన్ రూపొందిన సంగతి తెలిసిందే. అది సినిమాకి హైలెట్గా నిలిచింది. కానీ.. మూవీ మాత్రం డిజాస్టర్ టాక్‌ తెచ్చుకుంది.

ఇక తాజాగా.. భారీ అంచనాలు నడుమ సంక్రాంతి బ‌రిలో రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్‌ సైతం డిజాస్టర్‌గా మిగిలింది. గేమ్ ఛేంజర్ సినిమాలోను ట్రైన్‌ ట్రాక్ సీన్ బాగా హైలెట్. హెలికాప్టర్ పై చరణ్ వచ్చి కత్తితో చేసే యాక్షన్ అయితే గూస్ బంప్స్‌ తెప్పించింది అనడంలో అతిశ‌యోక్తి లేదు. ఇక ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం చరణ్‌.. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమా విషయంలోనూ ఫ్యాన్స్‌కు ఈ ట్రైన్ ట్రాక్ సీన్‌ విషయంలో టెన్షన్ మొదలైంది.

కారణం.. తాజాగా చరణ్ 18 ఇయర్స్ కంప్లీట్ సెలబ్రేషన్స్‌లో భాగంగా పెద్ది నుంచి రిలీజ్ అయిన పోస్టర్. రైల్వే ట్రాక్ పై చరణ్ కనిపించిన ఈ పోస్టర్‌లో చరణ్ స్టైలిష్ లుక్.. నుంచన్న తీరు అందరినీ ఆకట్టుకుంటున్నా.. రైల్వే ట్రాక్ ఉన్న సీన్ కనుక.. ఫ్లాప్ సెంటిమెంట్ మళ్లీ వర్క్ అవుట్ అయితే.. కచ్చితంగా సినిమా డీల పడిపోతుంది అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి పెద్ది సినిమాతో నైనా ఈ నెగటివ్ సెంటిమెంట్‌ను చరణ్ బ్రేక్ చేస్తాడో.. లేదో.. ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటాడో చూడాలి.