జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లకు.. నందమూరి బాలకృష్ణ, నారా కుటుంబానికి మధ్యన పెద్ద గ్యాప్ ఏర్పడిందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే నందమూరి తారక రత్న చనిపోయిన సమయంలోను జరిగిన కార్యక్రమానికి.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఇద్దరు అక్కడకు వెళ్లిన బాలయ్య వాళ్ళను కనీసం పలకరించకుండా అవమానించాడు. ఆ తర్వాత.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ దీనిపై స్పందించలేదు. ఇక రీసెంట్గా జరిగిన వార్ 2 మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లోను.. ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్ గా మాట్లాడుతూ.. తనకు ఎవరూ లేరని సొంతంగా పైకి ఎదగానంటూ తన అమ్మా,నాన్న, తాత మాత్రమే అండగా నిలిచారని వివరించాడు.
ఇలా.. ఇప్పటికే ఎన్నో సంఘటనలు నందమూరి, నారా కుటుంబాలతో తారక్‌తో చీలికలను వాస్తవం అని స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి క్రమంలో తాజాగా.. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో తెరకెక్కిన వార్ 2 సినిమా ఆడియన్స్‌ను పలకరించింది. కాగా.. ఈ సినిమాలో ఓ డైలాగ్ ను తెగ హైలెట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. వార్ 2లో తారక్ చెప్పిన చాలా డైలాగులు తన నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య, నారా ఫ్యామిలీకి పరోక్షంగా కౌంటర్ వేసేలా తారక్ చెప్పిన ఓ డైలాగ్ క్లియర్ గా అర్థమవుతుందంటూ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఒంటరి పోరాటం చేస్తూ.. అందరికీ దూరం అవుతూ అంటూ.. పవర్ ఫుల్ డైలాగ్ ను ఎన్టీఆర్ చెపుతుంటాడు.
ఆ డైలాగ్ విన్న వెంటనే చాలామంది ఆడియన్స్‌కు ఎన్టీఆర్.. నందమూరి, నారా కుటుంబ సభ్యులు మొత్తం తనను దూరం పెట్టారనే విషయాన్ని పరోక్షంగా చెబుతున్నాడని.. అభిప్రాయం కలుగుతుంది. రచయిత ఎన్టీఆర్ రియల్ లైఫ్ పరిస్థితిని ఆధారంగా తీసుకొని ఇలాంటి డైలాగులు రాశాడా.. లేదా.. దీని వెనుక ఎన్టీఆర్ ప్రమేయమే ఉందా.. ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అనే సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్‌తో దాదాపు వీటపై క్లారిటీ వచ్చేసింది. ఇక తారక్ సినిమాల్లో చెప్పిన డైలాగ్స్ వింటే కచ్చితంగా ఎన్టీఆర్ ప్రమేయంతోనే ఇలాంటి డైలాగ్స్ వచ్చాయని అంతా భావిస్తున్నారు. అంతేకాదు.. త్వరలోనే రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడని.. అందుకే ఇలా ఇండైరెక్టుగా బాలయ్య, నారా కుటుంబం పై విరుచకుపడుతూ.. ఇన్ డైరెక్ట్ గా హింసిస్తున్నాడని.. 2029 లో ఆయన రాజకీయాల్లో పాల్గొంటాడంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.