పాన్ ఇండియా సినీ ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్‌య హైప్ క్రియేట్ చేసిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. బాక్సాఫీస్ దగ్గర రిలీజై డిజాస్టర్ టాక్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా అయినా.. తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ కలెక్షన్లను అందుకుని.. మొదటి వారానికే థియేటర్ నుంచి తప్పకుంది. సినిమాకు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ దక్కిన.. సినిమా మిక్స్డ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచి కలెక్షన్లపై ప్రభావం దారుణంగా కనిపించింది. తర్వాత మరింతగా కలెక్షన్లు దిగజారుతూ వచ్చాయి. ఆడియన్స్‌ను సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీనికి ప్రధాన కారణ ఎన్టీఆర్ నెగటివ్ రోల్ లో నటించడం అంటూ కూడా వార్తలు వినిపించాయి.
ఈ క్రమంలోనే సినిమాకు నెగటివ్ కామెంట్స్ రావడమే కాదు.. పలు ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. ఇలాంటి క్రమంలో బాలీవుడ్ కాంట్రవర్షియల్ క్రిటిక్.. ఉమైర్ సంధు.. వార్ 2 ఫ్లాప్ గురించి ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ గా నిలుస్తున్న క్రమంలో.. వార్ 2తో అయినా సక్సెస్ అందుకోవాలని చూశాడని.. ఇక ఈ సినిమా ఫ్లాప్.. ఆయనను మరింత ఒత్తిడికి గురిచేసిందని.. ఈ క్రమంలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు ఉమూర్ సంధు పేర్కొన్నాడు.
BREAKING NEW : #HrithikRoshan tried to do suicide last night. He was in severe depression after back to back DISASTERS ! His career is totally OVER now. He locked himself in a room & did overdose of drugs !! He is fedup totally after #War2 FLOP. pic.twitter.com/oWM4Eo6tOM
— Umair Sandhu (@UmairSandu) August 28, 2025
అంతేకాదు.. హృతిక్ రోషన్ కెరియర్ ఇక ముగిసినట్టే అని.. తను డ్రగ్స్ కు బానిసగా మారాడంటూ వార్ 2 ఫ్లాప్ తో హృతిక్ పూర్తిగా విసుగుచెంది సూసైడ్ కు ప్రయత్నించాడంటూ రాసుకొచ్చాడు. ఉమైర్ కామెంట్స్ నెటింట వైరల్ గా మారడంతో.. హృతిక్ రోషన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తూ.. నోటికి వచ్చినట్లు మాట్లాడి చెత్త ఫీట్లు చేస్తున్నాడంటూ.. నోరు అదుపులో ఉంచుకోమంటూ బండ బూతులు తిడుతున్నారు. ప్రస్తుతం ఉమైర్ సంధు ట్విట్ వైరల్ గా మారుతుంది.