హెడ్ లైట్స్ బాలేవంటూ దారుణంగా టోల్స్ చేశారు.. స్టార్ బ్యూటీ ఎమోషనల్..!

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. స్టార్స్‌గా మారినా.. ఎలాంటి వారైనా మొదట్లో రకరకాలుగా ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్నచిన్న నటీనటుల నుంచి.. స్టార్ హీరో, హీరోయిన్ల వరకు ప్రతి ఒక్కరు కెరీర్‌లో ట్రాలింగ్స్ ను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చిన వారే. ఇక హీరోయిన్ల కైతే ట్రోల్స్ అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగినా.. ఏదో ఒక బాడీ షేమింగ్ తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారిలో నేను కూడా ఓ బాధ్యరాలని అంటూ తాజాగా స్టార్ బ్యూటీ అనన్య పాండే క్లారిటీ ఇచ్చింది.

లైగ‌ర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత తెలుగులో అసలు కనిపించిందే లేదు. మళ్లీ బాలీవుడ్‌కు చెకేసింది. ప్రస్తుతం అక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీగా గడుపుతున్న అనన్య.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది. ఇందులో భాగంగా మాట్లాడుతూ.. ఆమెచేసిన షాకింగ్ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలామంది నన్ను బాడీ షేమింగ్ చేశారని.. నీ హెడ్ లైట్స్ బాలేవంటూ దారుణంగా ట్రోల్స్ చేశారని.. అది ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయింది.

ఆ టైంలో ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు అండగా నిలిచారు. అప్పటి నుంచి అలాంటి వాగుడు అసలు పట్టించుకోను. మనం ఎలా ఉన్నా మాట్లాడే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు.. ఏదో ఒకటి సాధించడం చేతకాని వారే అలా అంటారని.. కామెంట్స్ చేయడానికి ఈజీగా నోరు వచ్చేస్తుందంటూ ఫైర్ అయ్యింది. అనన్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.