రజినీకాంత్ కూలీ రన్ టైం లాక్.. లోకేష్ పాత ట్రెండ్ వర్కౌట్ అయ్యేనా..!

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ టైటిల్ రోల్‌లో మెరవనున్న మూవీ కూలీ. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో మెరవనున్న ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫుల్ బిజీ బిజీగా ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఈ సినిమా ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఇక.. రజనీకాంత్ గ‌త‌ దశాబ్ద కాలంలో నటించినా సినిమాలన్నిటిలో సీబీఎస్సీ నుంచి ఏ సర్టిఫికెట్ అందుకున్న సినిమా రజనీకాంత్ కూలీనే కావడం విశేషం.

ఈ క్ర‌మంలోనే తాజాగా.. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారింది. మూవీ ర‌న్‌టైం పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కూలీ ర‌న్ టైం ఏకంగా 170 నిమిషాలు అంటే.. 2 గంటల 50 నిమిషాలు అంటూ నిర్ధారించారు. మరి ఇంత లాంగ్ టైంతో సినిమా స్క్రీన్ పైకి వస్తుందంటే అద్యంతం ట్విస్ట్‌ల‌తో ఆకట్టుకునేలా ఉండాలి. ఇంతకీ సినిమా ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుందా.. లేదా.. ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే ఆగస్టు 14 వరకు వేచి చూడాల్సిందే.

గోల్డ్ అక్రమ రవాణా బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాల్లో సత్యరాజ్, మహేంద్రన్, సౌబిన్ షాహిర్, రెబ్బ మౌనిక జాన్ తదితరులు కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక పూజ హెగ్డే సినిమాల్లో స్పెషల్ సాంగ్లో చేసింది. మూవీని స‌న్ పిక్స్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ నిర్మిస్తుండగా.. అనిరుధ్‌ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్య‌వహ‌రించాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.