రెండు భాగాలుగా ” రాజాసాబ్ “.. రిలీజ్ అయ్యేది అప్పుడే.. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో సీక్వెల్స్‌ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి బాహుబలి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతూనే ఉంది. బాహుబలి యూనివర్సల్ లెవెల్‌లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత.. చిన్న‌, పెద్ద హీరోల నుంచి స్టార్ట్ డైరెక్టర్ల‌ వరకు.. అందరూ సినిమాలకు సీక్వెల్స్ చేస్తూ బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. అలా ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా రెండు భాగాలతో వ‌చ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో.. పాన్ ఇండియా లెవెల్‌లో ఏ రేంజ్‌లో క్రేజ్ దక్కిందో తెలిసిందే. ఎన్టీఆర్ దేవరతో పాటు.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సైతం రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది. కేవలం టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ప్రస్తుతం ఇదే ట్రెండ్ మొదలైపోయింది.

Prabhas' never seen avatar in The Raja Saab! - TeluguBulletin.com

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో పాటు.. రామ్ పోతినేని స్కంద, తేజ సజ్జ హనుమాన్ లాంటి మీడియం రేంజ్ సినిమాలు సైతం.. సీక్వెల్స్ గానే బాక్సాఫీస్ దగ్గర పలకరించాయి. ఇలాంటి క్రమంలో.. తాజాగా రాజాసాబ్‌ మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ‌ప్రసాద్ మాట్లాడుతూ.. రాజాసాబ్ సినిమా సైతం.. రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానుంది అంటూ బిగ్ బాంబు పేల్చాడు. అయితే.. ఈ సినిమా రెగ్యులర్ సీక్వెల్స్‌లా కాకుండా.. మల్టీ యూనివర్స్‌గా రిలీజ్ కానుందట. సినిమా రిలీజ్ తర్వాత.. ఈ విషయంపై క్లారిటీ వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

Valentine Multiplex

ఇక మూవీ సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని.. తెలుగు బిజినెస్ సర్కిల్‌లో టాక్‌ నడుస్తుంది.. దానిపై మీరు ఏమంటారు అనే ప్రశ్నకు.. హిందీ బయర్స్ మాత్రం డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. ఇప్పటికే చెప్పినట్లుగా డిసెంబర్ 5న లేదా డిసెంబర్ 6న సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. కుదరకుంటే జనవరి 9న సినిమాలు రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలోనిది అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్, సంజయ్ దత్త్ తదితరులు కీలక పాత్రలో మెర‌వ‌నున్నారు. కాగా.. ఇప్పటికే ప్రభాస్ చేతిలో సలార్, కల్కి సినిమాల పార్ట్ 1 వచ్చి.. బ్లాక్ బ‌స్టర్లుగా నిలిచి.. రెండో పార్ట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే.. రాజాసాబ్ రెండో పార్ట్ కూడా ఈ లిస్టులో చేరనుంది. మరి.. ఈ సినిమాల సీక్వెల్స్ ఎప్పుడు తెర‌కెక్కి.. ఆడియన్స్‌లో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాయో చూడాలి.