” ఓజీ ” తెర వెనుక వాళ్ళిద్దరు.. డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ సుజిత్ కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఓజి. కేవలం పవన్ ఫ్యాన్స్ లోనే కాదు.. ఆడియన్స్ అందరిలోనూ ఈ సినిమాపై మంచి హైప్‌ నెలకొంది. ఇలాంటి క్రమంలో డైరెక్ట‌ర్ సుజిత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న ఓ ఎమోషనల్ పోస్ట్ నెటింట‌ తెగ వైర‌ల్‌గా మారుతుంది. ఇద్దరు వ్యక్తులను ఉద్దేశిస్తూ సుజిత్‌ ఈ పోస్ట్‌ను పంచుకున్నారు. తాజాగా వినాయక చవితి కానుకగా రిలీజ్ అయిన సువ్వి సువ్వి సాంగ్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుని దూసుకుపోతుంది.

ఇక సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు.. దాదాపు 25 రోజుల ముందే యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమైపోయాయి. ఇలాంటి క్రమంలో సుజిత్ తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. ఓజి ఇంత అద్భుతంగా, అందంగా కవిత్వంలా రావ‌డానిరి కారణమైన ఇద్దరు వ్యక్తుల గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ మాస్టర్స్ ఇద్దరు లేకపోతే అందమైన సినిమాటిక్ పొయ‌ట్రీ పాజిబుల్ అయ్యేది కాదని.. వీళ్ళిద్దరికీ ఋణపడిపోయి ఉంటా అంటూ రాసుకోచాడు.

OG hunt in full swing in Thailand | cinejosh.com

ముఖ్యంగా.. రవి కే చంద్రన్ మేధస్సు ఈ సినిమాకు ఎంతగానో తోడ్పడిందని సుజిత్ వెల్లడించాడు. పవన్ ఈ సినిమాల్లో ఓజాస్ గంభీర్ అనే గ్యాంగ్ స్టార్‌గా మెర‌వ‌నున్న‌ సంగతి తెలిసిందే. ఇక ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాతో మొదటిసారి విలన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కానన్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా.. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్గా వివరించిన ఏ సినిమాను.. డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్ హైప్‌ నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.