తారక్ కౌంటర్‌కు లోకేష్ ఎన్‌కౌంట‌ర్‌… నెక్ట్ లెవ‌ల్లోనే ఉందిగా…!

గత కొద్ది ఏళ్లుగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్యన తీవ్రమైన మనస్పర్ధలు తలెత్తయని ఇప్పటికే ఎన్నో రకాలుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణానంతరం నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక జట్ట అయ్యారని.. మిగతా నందమూరి కుటుంబం అంతా ఒకవైపు ఉన్నారని టాక్ కూడా నడిచింది. ఇదే సమయంలో గత వైసిపి ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసి.. లోపల ఉంచడంపై నందమూరి ఫ్యామిలీ అంతా తీవ్రంగా ఖండిస్తూ రియాక్ట్ అయినా.. ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు. అప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబాలు.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ను మరింత దూరం పెడుతూ వస్తున్నాయి.

నారా లోకేష్ సపోర్టు 'కూలీ' కే..పరోక్షంగా 'వార్ 2' చూడొద్దు అంటున్నాడా? - OkTelugu

దానికి ఉదాహరణ బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డు వచ్చిన తర్వాత సినీ, రాజకీయ ప్రముఖులందరూ దీనిపై స్పందిస్తూ బాలయ్యకు అభినందనలు తెలియజేశారు.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం అభినందనలు తెలియజేసిన బాలకృష్ణ మాత్రం వీళ్ళ అభినందనలపై రియాక్ట్ కాలేదు. అంతేకాదు.. పద్మభూషణ్‌ రావడంతో నారా, నందమూరి కుటుంబాలు కలిసి సెలెబ్రేట్ చేసుకున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు ఆహ్వానం కూడా అందలేదు. ఇలాంటి క్రమంలో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ఎన్టీఆర్ సైతం వార్ 2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తాత ఎన్టీఆర్ బ్లెస్సింగ్స్ నాపై ఉన్నంతకాలం నన్ను ఎవరు టచ్ కూడా చేయలేరంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

AP: Lokesh, Jr NTR supporters clash over TDP leadership

దీంతో.. బాలయ్య‌ను ఉద్దేశించి.. ఎన్టీఆర్ ఇలాంటి కామెంట్స్ చేశారంటూ బాలయ్య అభిమానులు తారక్ పై మండిపడ్డారు. మరోవైపు ఎన్టీఆర్ నటించిన వార్ 2తో పాటే.. రజనీకాంత్ కూలి సినిమా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే కూలి సినిమాకు బెస్ట్ విషెస్‌ తెలియజేసిన మంత్రి నారా లోకేష్.. ఎన్టీఆర్ వార్ 2.. సినిమా పై మాత్రం రియాక్ట్ కాకుండా లైట్ తీసుకున్నాడు. దీంతో.. సోషల్ మీడియాలో భారీ లెవెల్ లో న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. లోకేష్ కావాలనే ఎన్టీఆర్ సినిమా పేరు చెప్పలేదు అంటూ కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. చంద్రబాబు జైల్లో ఉన్న టైంలో రజినీకాంత్ వారి కుటుంబానికి అండగా ఉన్నాడు. కానీ.. ఎన్టీఆర్ కనీసం దానిపై రియాక్ట్ కూడా కాలేదు. ఇప్పుడు ఆ కృతజ్ఞతలతోనే లోకేష్.. కూలి సినిమాకు మద్దతుగా నిలిచాడని.. ఎన్టీఆర్ కౌంటర్ కు లోకేష్ ఎన్కౌంటర్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నారా లోకేష్.. ప్రస్తుత సపోర్ట్ పూర్తిగా కూలి సినిమాకే అని క్లారిటీ వచ్చేసిందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.