ప్రభాస్ పెళ్లి చెడగొట్టారా.. ఇకపై మ్యారేజ్ చేసుకోకూడదు అని డార్లింగ్ డిసైడ్ అయింది అందుకేనా..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియన్ ప్రాజెక్టులతో రాణిస్తున్న ప్రభాస్.. సినిమా టాక్ తో సంబంధం లేకుండా మినిమం కలెక్షన్లను కొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక ఆయన నుంచి చివరిగా వచ్చిన సలార్, కల్కి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ టాక్ దక్కించుకొని ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ప్రభాస్ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాజాసాబ్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్.

Prabhas Aunt Extends Support To Varma

దీంతోపాటే.. మరో నాలుగు ప్రాజెక్టులు ఆయన లైనప్‌లో ఉన్నాయి. ఇక.. సినిమాల విషయంలో ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేస్తూ ఫుల్ ట్రీట్ ఇస్తున్న ప్రభాస్.. పర్సనల్ విషయంలో మాత్రం నిరాశ కల్పిస్తున్నాడు. 45 ఏళ్ల వయసు దాటుతున్నా.. ఇంకా వివాహం చేసుకోకపోవడంతో ఎప్పుడెప్పుడు తమ ఫేవరెట్ హీరో పెళ్లి చేసుకుంటాడు అంటూ ఆసక్తి అభిమానుల్లో మొదలైపోయింది. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. ప్రభాస్ తన కెరీర్ స్టార్టింగ్ లో త‌న‌తో నటించిన ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. కానీ.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు, పెద్దమ్మ శారద దేవిలు ఇద్దరు ఆమె నీకు సెట్ అవ్వదు.. మన కుటుంబానికి తను తగిన వ్యక్తి కాదని.. హీరోయిన్గా సినిమాలు చేసే వాళ్ళు మనకి పనికిరారు అంటూ చెప్పేశారట.

Prabhas filmography - Wikipedia

సినిమాల్లో తెరపై కనిపించే వాళ్ళు కాకుండా.. బయట వాళ్లని ఎవరైనా చూసి ఇష్టపడితే కచ్చితంగా పెళ్లి చేస్తామని ప్రభాస్‌కు చెప్పడంతో.. వాళ్ల నిర్ణయాన్ని గౌరవించిన ప్రభాస్ ఆ హీరోయిన్ కు బ్రేకప్ చెప్పేసాడు. అయితే.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఎవరిని వివాహం చేసుకోలేదు. ఎప్పటికైనా ఎవరో ఒకరిని వివాహం చేసుకోవాలని ఆలోచన మాత్రం ప్రభాస్ రానివ్వలేకపోతున్నాడట. ఈ క్రమంలోనే ఏజ్ పెరిగిపోతున్న పెళ్లి వైపు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఇకపై అయినా ప్రభాస్ తన పెళ్లి గురించి ఆలోచిస్తారో.. లేదో.. చూడాలి.