వీరమల్లుకు క్రిష్ స్టొరీ అందుకే మార్చేశా.. అది కిక్కించింది.. జ్యోతి కృిష్ణ

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. నిధీ అగర్వాల్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే.. మొదట క్రిష్ డైరెక్షన్‌లో ఈ సినిమా ప్రారంభమైంది. సినిమా ఆలస్యం అవుతూ వస్తున్న నేపథ్యంలో క్రిష్‌ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో.. నిర్మాత ఏ.ఏం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ‌ సినిమాకు దర్శకుడుగా వ్య‌వహ‌రించాడు.

ఈ క్రమంలోనే ఆయన మూవీ స్టోరీ విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు చేశాడని వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా.. దీనిపై జ్యోతి కృష్ణ రియాక్ట్ అయ్యారు. మొదట క్రిష్ గారు కోహినూర్ డైమండ్ వెనక్కి తీసుకురావడమే లక్ష్యంగా కథలు రాసుకున్నాడని.. అయితే.. ఆయన తప్పుకున్న తర్వాత.. కథ నా దగ్గరకు వచ్చింది. నాకు మరో ఆలోచన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారీ చౌకేధార్ ఫైట్ చూసిన తర్వాత.. కోహినూర్ ఒక దాని గురించి కాదు.. ధర్మం గురించి కూడా కథలో ఏమైనా రాసుకుంటే బాగుంటుంది అనే ఫీల్ కలిగింది. ఆ విషయం పవన్ గారికి చెబితే ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేసారు అంటూ వివ‌రించాడు.

Hari Hara Veera Mallu will be magic: AM Jyothi Krishna

దీంతో.. అప్పుడు కేవలం ఒక్క కోహినూర్ కోసం కాదు.. ఒక్కొక్కరు ఒక్కొ కోహినూర్‌గా భావించే ఐదుగురు గురువుల కోసం వీరమల్లు ప్రయాణం చేస్తున్నట్లు సినిమాలో చూపించా. నిజానికి క్రిష్‌ రాసుకున్న కథ‌ ఎంటర్టైన్మెంట్ యాంగిల్‌లో కొనసాగుతుంది. అది బాగుంది. కానీ.. నాకు ఈ సనాతన ధర్మం ఎపిసోడ్ చేయాలనిపించింది. అందుకే అలా స్టోరీని మార్చేశా. నేను ఇలా కథను రాసిన ఏడాది తర్వాత నుంచే పవన్ కళ్యాణ్ సైతం సనాతన ధర్మం గురించి మాట్లాడడం ప్రారంభించారంటూ జ్యోతి కృష్ణ వివరించారు. ప్రస్తుతం జ్యోతి కృష్ణ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.