నితిన్ ‘ తమ్ముడు ‘ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా..!

ఒకప్పుడు వరుస సక్సెస్ లతో స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నితిన్.. గత కొద్ది ఏళ్లుగా వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తను తాజాగా నటించిన తమ్ముడు తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్‌లో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావ‌డంతో ఆడియన్స్లో కచ్చితంగా.. సినిమాలో ఏదో కంటెంట్ ఉండే ఉంటుందని ఆసక్తి మొదలైంది. దానికి తగ్గట్లుగానే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియ‌ప్స్‌ను ఆకట్టుకుంది.

కచ్చితంగా ఇందులో మినిమం కథ ఉందని క్లారిటీ వచ్చింది. అలాంటి అంచనాల మధ్యన సినిమా చూసేందుకు ధియేటర్లకు వెళ్లిన ఆడియన్స్‌కు నిరాశ ఎదురయింది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఘోరమైన డిజాస్టర్ టాక్ వ‌చ్చింది. ఈ ప్రభావం కలెక్షన్ల పై గట్టిగా పడింది. నితిన్‌కి ఒక సెక్షన్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో.. టాక్‌తో సంబంధం లేకుండా ఫస్ట్ డే బుక్ మై షో ద్వారా 30 వేల టికెట్లు అమ్ముడుపోయినా.. తర్వాత మెల్లమెల్లగా థియేటర్లలో ఆకీపేన్సి తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆడియన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయినా తమ్ముడు సినిమాకు ఫస్ట్ డే కేవలం రూ.4 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు మాత్రమే దక్కాయి.

ఇక నితిన్.. సినిమాకు ఈ రోజు కలెక్షన్స్ అంటే చాలా తక్కువే. కానీ.. ఆయన గత సినిమా రిజల్ట్ కారణంగా కూడా ఈ సినిమాపై ప్రభావం పడింద్టున్నారు. నితిన్ పరిస్థితి సినిమా సినిమాకు మరింత దీనంగా మారుతుంది. ఇక ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు రూ. 2కోట్ల షేర్ వసూళ్లు మాత్ర‌మే వచ్చాయి. ఈ క్రమంలోనే వీక్ మొత్తంలో కలిపి కనీసం రూ.4 కోట్ల షేర్ వ‌సూళ్లు అయిన వస్తాయో.. లేదో.. అనే భయం భయర్స్‌లో మొదలైంది. వచ్చినా.. ఈ వీకెండ్‌లోనే సినిమా కొల్లగొట్టాల్సి ఉంది. లేదంటే కనీసం ప్రమోషన్స్ కోసం చేసిన ఖర్చయిన వెనక్కి రావ‌డొం క‌ష్టం అంటూ అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.