ఫ్యాన్స్‌కు మెగాస్టార్ బిగ్ షాక్.. విశ్వంభ‌రకు నో ఛాన్స్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, వ‌శిష్ట‌ కాంబోలో విశ్వంభ‌ర‌ సినిమా 2023 అక్టోబర్‌లో మొద‌లైన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అఫీషియల్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. కానీ.. సినిమా ఏవో కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు మెగా ఫ్యాన్స్ అంతా సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా విషయంలో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్ర‌మంలో జులై – ఆగస్టు నెల దాటితే ఈ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం లేదని.. వచ్చేయడానికి సమ్మర్ లోనే విశ్వంభర రిలీజ్ ఉంటుందని టాక్‌.

ఇక ఇప్పటివరకు విశ్వంభర టీజర్ రిలీజై.. గ్రాఫిక్స్ పరంగా ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. చిరు ఫ్యాన్స్‌ను సైతం అసంతృప్తి పరిచిన టీజర్.. విఎఫ్ఎక్స్ విషయంలో తీవ్రమైన ట్రోల్స్‌ను ఎదుర్కొంది. విశ్వంభర గ్రాఫిక్స్ కష్టాలతో సినిమా మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ ఏడాది దసరాకు విశ్వంభర రిలీజ్ చేసే అవకాశం లేదు. దసరాకు ఇప్పటికే అఖండ 2, ఓజీ సినిమాలు రంగంలో ఉన్నాయి. దీపావళికి కూడా ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్‌కు ఫిక్స్ అయ్యాయి. నవంబర్, డిసెంబర్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్న అది వర్కౌట్‌ కానీ పరిస్థితి. కారణం.. అనిల్ రావిపూడి, చిరు కాంబినేషన్‌లో వచ్చేయేడాది సంక్రాంతి బరిలో జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది.

దీంతో రెండు సినిమాలు తక్కువ గ్యాప్ తో రిలీజ్ అయితే సినిమా రిజ‌ల్ట్ పైన ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే విశ్వంభర రిలీజ్‌కు కష్టాలు మొదలయ్యాయి. 2026 సంక్రాంతికి.. మెగా 157 ముందు రిలీజై.. తర్వాత తాపీగా విశ్వంభర వస్తుందని అభిప్రాయాలు తెగ వైరల్ గా మారుతున్నాయి. విశ్వంభర టీజర్‌కు వచ్చిన విమర్శలు వల్ల.. డైరెక్టర్ మరింత అలర్ట్ అయ్యారని టాక్. చిరంజీవి లాంటి స్టార్ హీరోతో ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని అస్సలు మిస్ యూజ్‌ చేసుకోకూడదు.. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని.. విశ్వంభర కోసం పగలు రాత్రి కష్టపడుతుస్తున్నాడట. రిలీజ్ ఆలస్యమైనా భారీ హిట్ కొట్టడం ఖాయమని టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులై, ఆగష్ట్‌లో తప్పితే విశ్వంభ‌ర వచ్చే ఛాన్స్ లేదు.