టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరకు గ్లామర్ మెరుపులు అందిన ఈ అమ్మడు.. యాంకరింగ్ రంగంలో దాదాపు దశాబ్ద కాలం పాటు దూసుకుపోయింది. జబర్దస్త్ లాంటి పాపులర్ కామెడీ షో లో యాంకరింగ్ తో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అనసూయ.. మరొపక్క సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలోనే నాలుగైదు సినిమాలకు స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది.
వాటిలో.. తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల సినిమా ఒకటి. అంతేకాదు.. ఆమె సొంత పేరుపై సూయ.. సూయ.. సూయ.. అనసూయ సాంగ్ తోను మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇక క్షణం, రంగస్థలం, పుష్ప, పుష్ప 2, రంగమార్తాండ, రాజాకర్, విమానం, పుష్పక విమానం, పెద్ద కాపు 2, పండుగాడు లాంటి ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక.. తను నటించిన ప్రతి సినిమాలోను అమ్మడి పాత్ర హైలెట్ అయ్యేలా చూసుకుంది. ఈ క్రమంలోనే.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇందులో భాగంగా.. అనసూయ మాట్లాడుతూ డైరెక్టర్.. బుచ్చిబాబు సాన్నాకు వార్నింగ్ ఇచ్చినట్లు వివరించింది. బుచ్చిబాబు డైరెక్షన్లో రాంచరణ్ హీరోగా ప్రస్తుతం పెద్ది సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనకు ఓ సాలిడ్ రోల్ కావాలని.. బుచ్చిబాబుకు తాను వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా.. బుచ్చిబాబునే ఎందుకలా అడిగిందో వివరిస్తూ.. తను రాసే సినిమా కథల్లో లేడీ క్యారెక్టర్లకు బలమైన పాత్రలు ఉంటాయి. అందుకే.. నా కోసం పెద్ది సినిమా లో మంచి రోల్ రాయమని చెప్పా అంటూ చెప్పుకొచ్చింది. ఇక పెద్ద సినిమాలో అనసూయకు.. బుచ్చిబాబు రోల్ ఇచ్చాడా.. లేదా.. తెలియాలంటే వేచి చూడాల్సిందే.