కన్నప్ప కు అసలైన యుద్ధం మొదలైంది.. !

టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు హీరో గా ప్రీతి ముకుందన్‌ హీరోయిన్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ , బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ , కాజల్ అగ్రవాల్ వంటి దిగ్గజా నటుల కాంబినేషన్లో బాలీవుడ్ మహాభారత డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం లో వచ్చిన డివోషనల్ హిట్ సినిమా కన్నప్ప .. దాదాపు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 42 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి .

కన్నప్ప' మూవీ రివ్యూ | Kannappa Movie Review And Rating In Telugu | Sakshi
అలాగే కన్నప్ప థియేటర్లో కి వచ్చి తొలి వీకెండ్ పూర్తయింది .. ఈ సోమవారం నుంచి కన్నప్ప కు అసలు సిసలైన ఆట మొదలు కానుంది .. సెలవులు పూర్తయ్యాయి .. ఇక వర్కింగ్ డేస్ లో కి అడుగుపెట్టడం తో కన్నప్ప కు సోమవారం నుంచి థియేటర్ల దగ్గర ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్న దాని మీదే అంత బేస్ అయి ఉంటుంది .. ఈ సోమవారం నుంచి కూడా సినిమా కు మంచి కలెక్షన్లు వస్తేనే భారీ టార్గెట్ కు దగ్గరవుతుంది . సోమవారం ఎగ్జామ్ లో కన్నప్ప పాస్ అయితే .. ఈ సినిమా భారీ విజయం సాధించినట్టే అని అనుకోవాలి .. అలాగే కన్నప్ప సినిమా కు స్టీపెన్ డేవస్సీ సంగీతం అందించగా మంచు విష్ణు , మోహన్ బాబు సొంతంగా సినిమాను నిర్మించారు ..