కుబేర రిలీజ్ కు ముందే స్టోరీ లీక్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!

కొలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ కుబేర. ఈ హైయెస్ట్ బడ్జెట్ సినిమాలో..అక్కినేని నాగార్జున కీలకపాత్రలో మెరవ‌నున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి, అమీగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా రూపొందింది. డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్, భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ కుబేర మూవీ.. జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్.. ఆడియన్స్‌లో మంచి హైప్ తెచ్చిపెట్టింది.

ఇలాంటి క్రమంలో రిలీజ్ కు ముందే సినిమా స్టోరీ లీక్ అయిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ చక్కర్లు కొడుతున్న ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ధనుష్ సినిమాలో బిచ్చగాడుగా కనిపించనున్నాడని.. నాగార్జున చార్టెడ్ అకౌంటెంట్గా క‌నిపిస్తాడని తెలుస్తుంది. ఇక నాగ్‌.. బాగా బలిసిన వారి బ్లాక్ మనీని రోడ్ సైడ్ ఉండే బెగ్గర్ పేరిట హవాలా చేయిస్తూ.. అకౌంట్‌ను మేనేజ్ చేయిస్తూ ఉంటాడు. ఈ నేపద్యంలోనే.. వేల కోట్లకు అధిపతి అయిన జిమ్ సర్బ్ బ్లాక్ మనీలో రూ.100 కోట్లను ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని నాగ్‌ ప్లాన్ చేస్తాడు. దానికి ఎరగా బిచ్చగాడు అయినా ధనుష్ ను వాడుకుంటాడు. అయితే.. అనుకోకుండా నాగ్‌ కొట్టేసిన ఆ మనీ అంతా రష్మికకు దొరుకుతుంది. అటు ధనుష్‌కు సైతం నాగార్జున ప్లాన్ అర్ధమైపోతుంది.

Kubera: Rashmika Mandanna digs up a suitcase of cash in her first look from Sekhar  Kammula's film. Watch - Hindustan Times

తర్వాత ఇద్దరి మధ్య ఎలాంటి ఫైట్ మొదలైందో.. రష్మిక ఇంతకీ ఆ డబ్బును ఎక్కడ దాచిందో.. జిమ్స్ స‌ర్భ్ తన డబ్బు కొట్టేసినందుకు నాగ్‌ను ఎలా శిక్షించాడు.. అన్నదే కుబేర మూవీ అసలు స్టోరీ అట. కథలో భాగంగా.. వచ్చే ట్విస్ట్ లు, టర్నింగ్ పాయింట్‌లు డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెర‌కెక్కించిన విధానం.. ప్రతి ఒక్క సీన్.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం స్టోరీ వైరల్ గా మారడంతో.. ఇదే వాస్తవమైతే కుబేర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రియులు.