పాన్ ఇండియా లెవెల్‌లో ప్రస్తుతం రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమాలలో బాలీవుడ్ రామాయణ్ ఒకటి. రణబీర్ కపూర్ రాముడిగా.. సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సీతగా మెరవనున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నాడు. ఇక నితిన్ తివారి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా.. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని.. 2027లో రెండవ భాగాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో తెగ వైరల్‌గా మారుతుంది.
రావణుడి చెల్లెలు సూర్పణక పాత్ర కోసం.. స్టార్ హీరోయిన్లను సంప్రదిస్తున్నారట టీం. కాగా.. మొదట ఈ అవకాశం గ్లోబల్ బ్యూటీ ప్రియాంకను వరించగా.. తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో ఆమె ఫుల్ బిజీగా ఉండడంతో.. మూవీ యూనిట్ ప్రియాంకని వదిలేసి.. రకుల్ ప్రీత్ సింగ్‌ను సూర్పణక పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఇలాంటి భారీ ప్రాజెక్టు దక్కించుకున్న రకుల్.. వెంటనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక.. ఈ సినిమాలో ఆమెకు లుక్ టెస్ట్ చేసేందుకు మేకర్స్ సైతం సిద్ధమవుతున్నారట.
ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. రామాయణ్‌లో సని డియోల్.. హనుమంతుడిగా, లారా దత్త.. కైకేయగా మెరువనున్నరని తెలుస్తుంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు కాంబో మూవీ ఎస్ఎస్ఎంబి 29 లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె బాలీవుడ్ రామాయణం వదులుకున్నట్లు సమాచారం. అటు.. రకుల్ చివరిగా మీరే హస్బెండ్ కి బీబీ మూవీలో మెరిసింది. ఈ క్రమంలోనే అమ్మడు రామాయణ్‌లో నటించే జాక్‌పాట్ కొట్టేసింది.