ఇండియన్ వైడ్ గా ” కుబేర ” ట్రైలర్ హవా.. ఎన్ని వ్యూస్ వచ్చాయంటే..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన మూవీ కుబేర. జూన్ 20న గ్రాండ్‌ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా.. సోషల్ పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్కుతుంది. నాగార్జున ఈ మూవీలో కీలకపాత్ర మెరవనున్నాడు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా.. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక తాజాగా.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా రాజమౌళి హాజరై సందడి చేశాడు.

సినిమా టీజర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ మరింత ఆసక్తి పెరిగింది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. కేవలం జక్కన్నకే కాదు చాలామంది ట్రైలర్ చూసిన ఆడియన్స్‌ సైతం.. ఆసక్తిని నెలకొల్పుతోందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా రిలీజ్ 24 గంటలు కూడా కాకముందే సోష‌ల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ విష‌యాని మేకర్స్‌ అఫీషియల్ గా ప్రకటించారు. తాజాగా.. మూవీ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 10 మిలియన్ ప్లస్ వ్యూస్ దక్కించుకుందని చెప్పుకొచ్చారు.

ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియా వేదికగా సరికొత్త పోస్టర్‌తో అనౌన్స్ చేయడం విశేషం. ఈ సినిమాలో జిమ్ సర్బ్‌, గాలిబ్ తాహిల్ మరియు సయాజి షిండే కీలక పాత్రలో మెర‌వనున్నారు. ఇక ఈ సినిమాకు కెమెరా హ్యాండిల్ నీకేది బొమ్మి, ఎడిటర్ గా కార్తీక శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఈ సినిమాను.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ llp మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ రావు ఎక్క‌డ‌ తగ్గకుండా నిర్మించారు.