కొలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన స్ట్రెయిట్ తెలుగు మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో మెరవనున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా కనిపించనుంది. ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై.. సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. డిఎస్పీ మ్యూజిక్ అందించాడు. తాజాగా.. రిలీజ్ అయిన ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్.. సినిమాపై ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొల్పింది. ఈ క్రమంలోనే కుబేర సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లవెల్లో అంచనాలు మొదలయ్యాయి.
ఇక ధనుష్.. కెరీర్లోనే ఇది హయెస్ట్ బడ్జెట్ మూవీ కావడం విశేషం. ఇక.. జూన్ 24న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. మొత్తం మూడు గంటల 15 నిమిషాల రన్ టైం వచ్చిందని.. దీంతో 14 నిమిషాలు ట్రిమ్ చేసి చిన్న చిన్న మార్పులతో సినిమాను ఫినిష్ చేయాల్సిందిగా సెన్సార్ సభ్యులు టీంకు సూచించి.. యు\ఏ సర్టిఫికెట్ అందించారు. ఈ క్రమంలోనే సినిమా రన్ టైం విషయంలో.. ధనుష్ అభిమానుల్లో ఆందోళన మొదలైందని తెలుస్తుంది. ఏకంగా 3 గంటల సినిమా అంటే.. అది ఎంతగానో ఎంటర్టైన్ చేస్తే తప్ప.. కాస్త సినిమా బోరింగ్‌గా ఫీల్ అయినా.. అసలుకే మోసం వస్తుందని.. అభిమానుల్లో ఆందోళన మొదలైందట.
3 గంటలకు పైగా రన్ టైం ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుందని.. ఇంకాస్త రన్ టైం తగ్గిస్తే బాగుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇటీవల కాలంలో హైయెస్ట్ రన్ టైంతో వచ్చిన చాలా సినిమాలు.. మంచి సక్సెస్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు.. శేఖర్ కమ్ములపై ధనుష్ కూడా ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఈ క్రమంలోనే కుబేర ఊహించిన దానికంటే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు టీం. తెలుగు, తమిళంలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో.. ఎలాంటి కలెక్షన్లు కొలగొడుతుందో చూడాలి.