సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా నుంచి ఓ టీజర్ లేదా ట్రైలర్ మరి ఏదైనా అప్డేట్ వస్తుందంటే చాలు సోషల్ మీడియాలో అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకదా.. యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ హడావిడి కూడా అదే రేంజ్ లో మారుమోగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మెగా వర్సెస్ నందమూరి హీరోల మధ్య వచ్చే ఫ్యాన్ వార్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా మొత్తం వారం రోజుల పాటు ట్రోల్స్ తో కలకలలాడిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న అఖండ 2 మూవీ టీజర్ ను ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు.
నందమూరి ఫ్యాన్స్ టీజర్ అదిరిపోయింది అంటూ సంబరాలు చేసుకుంటుంటే.. మరోపక్క ఇతర హీరోల అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ మాత్రం తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య మెడలో త్రిశూలం పెట్టుకొని తిప్పుతూ విలన్‌లను నరికే సీన్ అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తుంటే.. ట్రోలర్‌లకు మాత్రం స్ట్రాంగ్ స్టఫ్‌గా మారింది. ఈ షార్ట్ పై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వెలువడుతున్నాయి. బాలయ్య మెడలో త్రిశూలం గిరగిరా తిరుగుతూ శత్రువుల మెడలు కట్ చేస్తున్న సన్నివేశాన్ని ట్రోల్ చేస్తూ.. గిర్ర గిర్ర తిరుగుతుంది ఫ్యాను అనే సాంగ్ ఎడిట్‌చేసి వీడియోను రిలీజ్ చేసి ట్రోల్ చేస్తున్నారు.
1జగన్ ఫ్యాన్స్ సైతం ఈ ఎడిట్ ను ఎంజాయ్ చేయడం విశేషం. అదేవిధంగా.. చల్లని డర్మికుల్ ఇది అంటూ వచ్చే ఒక కమర్షియల్ యాడ్ ని ఎడిట్ చేస్తూ.. అఖండ 2 టీజర్ లోని కొన్ని షాట్స్ జోడిస్తున్నారు. అది కూడా వైరల్ గా మారుతుంది. అలాగే మూవీ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ టీజర్ లోని కొన్ని షాట్స్ తీసుకుని లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి దెయ్యాలకోట అనే ఆడియోను ఎడిట్ చేస్తున్నారు. ఈ ఎడిటింగ్ వీడియోస్ తో బాలయ్య యాంటి ఫ్యాన్సే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం వాటిని చూసి తెగ నవ్వుకుంటున్నారు. రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Menta bal Deyyala Kota 🤣🤣 pic.twitter.com/ZrJ5lIMrla
— KLAUS (@teju_819) June 9, 2025
Perfect summer ad pic.twitter.com/FEcr61YVe8
— RAVI TEJA CULT (@NamanseNakitiki) June 9, 2025
Oreyyy 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣#Akandha2 pic.twitter.com/BRfqVHQUpv
— 𝙉𝙄𝙓𝙓𝙔🇮🇳 (@AaaleBaale) June 9, 2025