టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై.. విష్ణు హీరోగా నటించిన తాజా మూవీ కన్నప్ప. ఈ మూవీపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాని ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. అందులో భాగంగానే ఇటీవల.. మూవీలోని పిలక, గిలక పాత్రలను ఆడియన్స్ కు పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్లను రిలీజ్ చేశారు. అయితే.. ఈ పోస్టర్‌పై బ్రాహ్మణుల సంఘం మండిపడ్డారు. గుంటూరులో కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలి.. లేదంటే సినిమాను బహిష్కరిస్తామని కోర్టు మెట్లు ఎక్కుతామంటూ డిమాండ్ చేశారు.
మోహన్ బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుందని.. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు జరిగాయి. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు.. లేవని ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించకపోతే.. కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ప్రకటన రిలీజ్ చేయడంతో.. ఈ వివాదం నెటింట తెగ వైరల్ గా మారింది. అయితే తాజాగా.. ఈ వివాదం పై మంచు విష్ణు రియాక్ట్ అయ్యారు.
ఎవరిని కించపరచాలని కన్నప్ప సినిమాను రూపొందించలేదని.. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం మా లక్ష్యం కాదని.. మా సినిమాను శివుడి పై భక్తి భావంతో చూపించాలని ప్రయత్నించాం. దయచేసి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఓపిక పట్టండి అంటూ చెప్పుకొచ్చాడు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. సినిమాలో పరమశివుడిని భక్తితో చూపించామని విష్ణు చెప్పుకొచ్చాడు. సినిమా రిలీజ్ అయితే వాటిపై అందరికీ క్లారిటీ వస్తుందంటూ వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.