కుబేర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా.. బయ్యర్లకు రిస్క్ తప్పదా..?

సౌత్ క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత.. చాలా గ్యాప్ తీసుకొని రూపొందించిన మూవీ కుబేర. అక్కినేని నాగార్జున, ధనుష్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి ఆంచనాలు నెల‌కొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ అభిమానులతో పాటు సాధారణ ఆడియో సైతం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు వల్ల ఎదురు చూపులకు తెర‌ప‌డింది. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. మంచి రెస్పాన్స్‌ని దక్కించుకుంది. ఇలాంటి క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారుతున్నాయి.

Kuberaa - Wikipedia

ఈ సినిమాను ఏషియన్ గ్రూప్ సంస్థ అధినేత సునీల్ నారంగ్‌ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఖర్చకి ఏమాత్రం వెనకాడకుండా ప్రతిష్టాత్మకంగా సునీల్ నారంగ్‌ ఈ సినిమాను రూపొందించాడు. దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాకు.. తమిళ్, తెలుగు భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. కనుక.. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే.. రెండు భాషల్లోనూ వసూళ్లు భారీగా కొల్లగొడతాయి. ఈ క్రమంలోనే.. ఖచ్చితంగా సినిమా ఆడియన్స్‌ను మెప్పించేలా తెర‌కెక్కించాలని.. ఈ రేంజ్ బడ్జెట్ పెట్టానని సునీల్ నారంగ్‌ వివరించాడు. అంతేకాదు.. సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఏకంగా రూ.47 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్‌ నడుస్తుంది. ఇది మామూలు మ్యాటర్ కాదు. కేవలం డిజిటల్ రైట్స్‌కి మాత్రమే కాదు.. సాటిలైట్ రేట్స్‌, ఆడియో రైట్స్, నాన్‌ ధియేట్రిక‌ల్ రైట్స్ ఇలా మొత్తం కలిపి రూ.80 నుంచి 90 కోట్ల వరకు బిజినెస్ జరిగిందట‌.

Kuber Shekhar Kammula's Film Kubera First Look Out, DSP to Provide Music |  Culture Crossroads

కేవలం నాన్ ధియేట్రికల్ రైట్స్‌కే ఈ రేంజ్‌లో బిజినెస్ జరిగిందంటే.. సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక థియేటర్ రైట్ తమిళ్, తెలుగులో కలిపి రూ.75 కోట్ల‌కు అమ్ముడు పోయిన‌ట్లు సమాచారం. అంటే మొత్తంగా పెట్టిన బడ్జెట్ రూ.120 కోట్ల విలువకు బిజినెస్ ముందుగానే జరిగిపోయింది. ఇక రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు లాభం కూడా వచ్చిందని చెప్పాలి. ఇటీవల కాలంలో ధనుష్ సినిమాకు కానీ, నాగార్జున సినిమాకు కానీ బిజినెస్ ఈ రేంజ్‌లో జరగలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ క‌లెక్షన్‌లు రాబడుతుందో.. ఆడియన్స్‌ను ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇంకా సినిమా బ్రేక్ అందుకోవాలంటే.. కచ్చితంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వ‌శూళ్లు కొల్లగొట్టాల్సి ఉంది. మరి.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి బయ్యర్లను బయటపడేస్తుందో.. లేదో.. చూడాలి. ఇక సినిమా ఫస్ట్ రివ్యూ ప్రకారం ధనుష్‌కు మరో నెషనల్ అవార్డు పక్క అని.. కంటెంట్ అదిరిపోయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.