బాలయ్య డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు ఏంటో తెలుసా.. వాటి రిజల్ట్ ఇదే..!

నంద‌మూరీ న‌ట‌సింహం బాలకృష్ణ ఐదు దశాబ్దాలుగా.. ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి సీనియర్ స్టార్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఇస్తున్న బాలయ్య.. ఇప్పటికే నాలుగు సక్సెస్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే రెండోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక.. తాజాగా జాతీయ అవార్డులను సైతం తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ స్వింగ్ లో రాణిస్తున్నాడు. కాగా.. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు గ్రాండ్ లెవెల్ లో అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు సైతం వైరల్ గా మారుతున్నాయి.

Peddannayya

బాలయ్య తన 50 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. విభిన్నమైన పాత్రలను పోషించాడు. కానీ.. దర్శకుడుగా కూడా ఆయన రెండు సినిమాలను చేశాడ‌న్న సంగతి చాలా మందికి తెలియదు. పైగా ఆయన డైరెక్ట్ చేసిన రెండు సినిమాల రిజల్ట్ తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటో వాటి రిజల్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. బాలయ్య తెర‌కెక్కించిన‌ రెండు సినిమాల్లో ఒకటి పెద్దన్నయ్య. 1997లో రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ డ్రామాకు శరత్ డైరెక్టర్ కాగా.. ఇంద్రజ, రోజా హీరోయిన్లుగా నటించి మెప్పించారు.

Gautamiputra Satakarni | Telugu Movie News - Times of India

అయితే.. చాలామందికి తెలియని మేటర్ ఏంటంటే.. పెద్దన్నయ్య క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తానికి బాలయ్య దర్శకుడు వ్యవహరించారు. కట్ చేస్తే.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ సక్సెస్ అందుకుంది. తర్వాత.. బాలకృష్ణ దర్శకత్వం వహించే అవకాశం తీసుకున్న మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన కెరీర్‌లో 100వ‌ సినిమాగా రూపొందిన ఈ ప్రాజెక్ట్‌లో శ్రియ శ‌ర‌ణ్‌ హీరోయిన్గా మెరిసింది. అయితే.. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. కొన్ని సన్నివేశాలు బాలయ్యనే దర్శకుడుగా పనిచేశారు. అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి కోసం బాలయ్య పడిన కష్టం కెరీర్‌లో మరే సినిమాకు పడలేదట. ఇక 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా సైతం భారీ వసూలు కొల్లగొట్టి క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.