స్పిరిట్ కోసం సందీప్ మాస్టర్ ప్లాన్.. ప్రభాస్ కు అక్కడ స్పెషల్ ట్రైనింగ్.. !

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. క్షణం తీరకలేకుండా షూటింగ్లలో పాల్గొంటున్న ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్‌, ఫౌజీ సినిమాల పనులు పూర్తయిన వెంటనే సందీప్ వంగా.. స్పిరిట్ సినిమా కోసం సిద్ధం కానున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్.. స్పెషల్‌గా మేకోఓవర్ కానున్నాడంటూ.. వార్త‌లు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఇక స్పిరిట్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే.. ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పిన‌ సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందంటూ.. ప్రభాస్ అభిమానులతో పాటు.. సందీప్ రెడ్డి వంగ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Spirit (2026) - IMDb

గతంలో సందీప్ తెరకెక్కించిన యానిమల్ సినిమాల్లో రణ‌బీర్‌ను ఏ రేంజ్ లో ఎలివేట్ చేశాడో తెలిసిందే. ఈ క్రమంలోనే ఏడు అడుగుల మన డార్లింగ్ ని ఇంకే రేంజ్ లో ఎలివేట్ చేస్తాడో అనే ఆసక్తి ప్రభాస్ అభిమానుల్లో మొదలైంది. ఇక హీరో క్యారెక్టర్‌ని ఇప్పటికే సందీప్ రివీల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాప్ రోల్‌లో ప్రభాస్ మెరవ‌నున్నాడు. ఈరోల్‌ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని సందీప్ వివరించాడు. సామాన్య మానవుడి పాత్రనే పవర్ ఫుల్ గా డిజైన్ చేసే సందీప్.. ఒక్క డిఫెన్స్ ఆఫీసర్గా పోలీస్ పాత్రను ఏ రేంజ్ లో హైలైట్ చేస్తాడో ఊహకే అందదు. ఈ క్ర‌మంలోనే డార్లింగ్ రోల్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రివీల్ అవ్వడంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో మెరవ‌నున్నడట.

Prabhas to Begin Filming for 'Spirit' in May 2025

ఒకటి కాప్ రోల్‌ కాగా.. మరో పాత్రల్లో లవర్ బాయ్‌గా.. ఇంకో రోల్ లో గ్యాంగ్ స్టార్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఈ గ్యాంగ్స్టర్ రోల్ కు సంబంధించి ప్రభాస్ ను సందీప్ విదేశాలలో స్పెషల్ ట్రైనింగ్ కు పంపించనున్నాడట. మొదట ఈ ట్రైనింగ్ కోసం జపాన్ కు పంపించి.. తర్వాత ట్రైనింగ్ పూర్తయిన వెంటనే.. రష్యాల్లో కూడా ఆ పాత్రకు సంబంధించిన మరికొంత అవగాహన కోసం మరో స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించడం ఉన్నట్లు సమాచారం. ఇదే వాస్తవమైతే ప్రభాస్ కూడా రికార్డ్ క్రియేట్ చేసినట్లే. ఇంతవరకు ప్రస్తుత జనరేషన్ హీరోల్లో ఎవరు పాన్ ఇండియ‌న్ ప్రాజెక్ట్‌లో ట్రిపుల్ రోల్‌లో నటించింది లేదు. బన్నీ 22వ ప్రాజెక్టులో త్రిబుల్ రోల్‌లో నటించిన విషయాన్ని ఇప్పటివరకు మేకర్స్‌ ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ త్రిబుల్ రోల్ లో నటిస్తే మాత్రం కచ్చితంగా రికార్డ్ క్రియేట్ చేసినట్లే అవుతుంది.