టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత కుబేర లాంటి గ్రాండ్ సక్సెస్ వచ్చింది. దీంతో దెబ్బకు ధియేటర్లు కలకలలాడుతున్నాయి. కుబేర సినిమాకు ఫస్ట్ నుంచి సూపర్ డూపర్ టాక్ రావడంతో.. వరుసగా థియేటర్లని హౌస్ ఫుల్ అవుతున్నాయి. టాలీవుడ్ కింగ్ నాగార్జున, టాలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. రష్మిక మందన హీరోయిన్గా మెరిసింది. సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. నైజంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న ఏషియన్ సునీల్, పుష్కర రామ్మోహన్ రావు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. ఈ క్రమంలోనే కుబేర మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ.80 కోట్లు గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టడం విశేషం. ఇందులో భాగంగానే తాజాగా కుబేర టీం గ్రాండ్ లెవెల్లో ఏర్పాటు చేశారు.
దీనికి స్పెషల్ గెస్ట్‌గా చిరంజీవి హాజరయ్యాడు. ఇక స్టేజ్ పై చిరంజీవి మాట్లాడుతూ ఇది నా సక్సెస్ మీట్‌లా అనిపిస్తుంది. ఇక్కడ నేను గెస్ట్ గా వచ్చినట్టు కాదు.. మీలో ఒక్కడిగా.. మీ ఆత్మీయుడుగా వచ్చాను అంటూ చిరంజీవి కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో తన తోటి హీరో నాగార్జున గురించి మాట్లాడుతూ ఆయన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు చిరంజీవి. నాగార్జున తనకు ఎన్నో విషయాల్లో ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. అందం, ఫిట్నెస్, కూల్ గా ఉండడం ఇలా వీటన్నిటిలో నాగార్జుననే నాకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు సినిమాల వైవిధ్యమైన క్యారెక్టర్ సెలక్షన్స్‌లోనూ నాకు మంచి ఇన్స్పిరేషన్గా మారిపోయాడంటూ చెప్పుకొచ్చాడు.
అంతేకాదు.. నాగార్జున గురించి మాట్లాడుతూ నాకు తెలిసి నాగార్జున ఇప్పటివరకు ఎప్పుడు.. ఎవరి కాళ్లకు నమస్కారం చేయలేదని వివరించాడు. ఆయన ఇండస్ట్రీలో నమస్కారం చేసిన ఏకైక వ్యక్తి అంటూ ఏషియన్ సునీల్ ను చూస్తూ.. సునీల్ మీ నాన్నగారు అయిన నారాయణ దాస్ నారంగ్ కాళ్లకు మాత్రమే ఆయన నమస్కారం చేయడం నేను చూశాను అంటూ చిరంజీవి వివరించాడు. అంతేకాదు.. నాగార్జున ఇండస్ట్రీలో ఎవరినైనా సరే పేరు పెట్టి.. లేదా ఏక వచనంతోనే పిలుస్తాడట. చివరకు తన సొంత అన్న అక్కినేని వెంకట్‌ని కూడా ఏరా అని సంబోదిస్తాడట. కానీ.. ఇండస్ట్రీలో ఆయన అన్న అని గౌరవంగా పిలిచే ఏకైక వ్యక్తి నందమూరి హరికృష్ణ. సీతారామరాజు సినిమా చేసినప్పటి నుంచి అన్నయ్య అని హరికృష్ణను ఎంతో ప్రేమగా నేను పిలుస్తూ ఉంటానని గతంలో స్వయంగా నాగ్ వివరించాడు.