సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీల్ గా రాణిస్తున్న చాలా మందికి పాలిటిక్స్, పొలిటిషయన్స్‌తో టచ్ ఉండనే ఉంటుంది. అలా.. ఇప్పటికే ఎంతో మంది స్టార్స్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అందుకున్నారు. హీరోలతో పాటు.. హీరోయిన్స్ కూడా రాజకీయాలను శాసించడం ఎన్నో సందర్భాల్లో చూశాం. ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, అన్నాదురై ఇలా చాలామంది నటులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయాలను శాసించిన సంగతి తెలిసిందే. అయితే మహిళలలో చాలా తక్కువ మంది మాత్రమే రాజకీయాలను శాసించారు. అలా మహిళా సీఎం గా ఉన్నవాళ్లు ఎవరు అంటే టక్కున మనకు జయలలిత పేరు వినిపిస్తోంది. కానీ.. జయలలిత కంటే ముందు సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళా తమిళనాడు సీఎం గా వ్యవహరించిందన్న సంగతి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.
ఆమె మరెవరో కాదు వి.యన్. జానకి. పూర్తి పేరు వైకుం నారాయణ జానకి.. కేరళలో 1924 సెప్టెంబర్ 23న జన్మించిన ఈమె.. చిన్న వయసులోనే మ్యూజిక్ సహా వివిధ రంగాల్లో ట్రైనింగ్ పొందింది. ఆమె బంధువు పాపనాశం శివన్ ఒక కర్ణాటకి.. అతను ఓ మ్యూజిషియన్ కావడంతో.. ఆయన దగ్గరే క్లాసికల్ మ్యూజిక్, డ్యాన్స్ నేర్చుకున్న జానకి.. పాపులర్ యాక్ట్రెస్‌గా మంచి ఇమేజ్ను తెచ్చుకుంది. ఎంజీఆర్‌కు జంటగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఎంజిఆర్‌ను వివాహం చేసుకుంది. ఎంజీఆర్ 1987లో మరణించారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తడంతో.. ఆయన సతీమణి జానకి, అలాగే.. ఎంజీఆర్‌కు రాజకీయాల్లో అత్యంత సన్నిహితురులైన జయలలితకు మధ్య పోటీ ఏర్పడింది.
ఈ అంతర్గత పోరు మధ్యలో.. 1988 జనవరి 7న తమిళనాడు సీఎంగా జానకి బాధ్యతలు చేపట్టింది. కేవలం 23 రోజులు మాత్రమే అంటే 1988 జనవరి 30 వరకు ఆమె సీఎంగా బాధ్యతలు నిర్వర్తించి.. తర్వాత జయలలితకు ఆ బాధ్యతలు అప్పగించి రాజకీయాల నుంచి తప్పుకుంది. అలా భారతీయ రాజకీయాల్లోనే మొట్టమొదటి మహిళా నటి.. సీఎంగా జానకి చరిత్ర సృష్టించింది. తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి జారుకున్న తమిళనాడు ను తానే గట్టెక్కించింది. ఇక ఈమె తెలుగులోను 1960లో తెరకెక్కిన సహస్ర సిరిచేత అపూర్వ చింతామణి సినిమాలో మెరిసింది. జయలలిత జీవిత నేపథ్యంలో తలైవి.. బయోపిక్‌లోనూ జానకి పాత్ర ఉంది. ఇక ఆ పాత్రలో రోజా మూవీ హీరోయిన్ మధుబాల మెరిసింది.