బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న తాజా మూవీ వార్ 2. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కనున్న ఈ మూవీలో తారక్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై తారక్ ఫ్యాన్స్ లోను మంచి ఆసక్తి నెలకొంది. అయితే.. ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిందని.. స్పెషల్ సాంగ్స్ కూడా షూటింగ్లో ముగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి క్రమంలో హీరో హృతిక్ రోషన్ గాయపడినట్లు సమాచారం. సాంగ్ రిహార్సేల్స్ చేస్తూ ఉండగా.. హృతిక్ రోషన్‌కు గాయమైందట. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ మధ్యన కూడా ఫ్యాన్స్ వార్ ఉండబోతుందని.. రిహార్సల్ చేస్తున్న క్రమంలోనే హృతిక్ రోషన్ గాయపడినట్లు సమాచారం. దీంతో మూవీ టైం హుటా హుటేనా హృతిక్‌ను హాస్పిటల్కు తీసుకువెళ్లాగా.. సుమారు 30 రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. ఈ విషయం బాలీవుడ్ అంతా తెగ వైరల్ గా మారుతుంది.
దీంతో సినిమా షూటింగ్ ఆగిపోయిందని సమాచారం. ఈ క్రమంలోనే హృతిక్ రోషన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సరైన ఇన్ఫర్మేషన్ మూవీ టీం అఫీషియల్ గా ప్రకటిస్తుందని ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు హృతిక్ రోషన్ గాయం కారణంగా సినిమా రిలీజ్ కి కూడా బ్రేక్ పడినట్లే అని తెలుస్తుంది.