టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా పాపులారిటి సంపాదించుకున్న నాగార్జున ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్ లో పలు సినిమాల్లో నటించి హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు . ఆయన లాస్ట్ గా నటించిన సినిమా నా స్వామి రంగా ..ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంటాడు అని భావించారు కానీ ఆవరేజ్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు .
ప్రజెంట్ కుబేర సినిమాలో నటిస్తున్నాడు . అదేవిధంగా తన 100వ సినిమా కోసం బిజీబిజీగా ముందుకు వెళ్తున్నాడు . ఇదే క్రమంలో.. నాగార్జున టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి ట్రైలర్ పై స్పందించడం ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది . ఇటీవల విడుదలైన కల్కి ట్రైలర్ చూసిన నాగ్ సినీ మేకర్స్ పై ప్రశంసల కురిపించాడు .
“ఏం ప్రపంచాన్ని సృష్టించారు నాగీ.. మన భారతదేశం అపూర్వమైన కథలను తెరపైకి తీసుకువస్తున్నారు. రియల్లీ హాట్సాఫ్ ..ఈ చిత్రాన్ని చూసి ఉబ్బి తబ్బిపోతున్నాను.. అమితాబ్ జి ఫైర్ ..కమల్ జి జస్ట్ వావ్ ..ప్రయోగాలు చేసే ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను ప్రభాస్.. చివరిగా నా అభిమాన నిర్మాత అశ్విని దత్ – స్వప్న – స్వీటీ లకి శుభాకాంక్షలు. ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను.. మిమ్మల్ని ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు “అంటూ పోస్ట్ చేశాడు. అయితే నాగార్జున ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్ర కోసం నాగ్ అశ్వీన్ అప్రోచ్ అయ్యారు అని ..అయితే నాగార్జున రిజెక్ట్ చేశాడు అని ప్రచారం జరిగింది . అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నాగార్జున పై మండిపడ్డారు..!!
What a world
You have created Nagi!!! Bringing our incredible tales of India on to the screen!!Overwhelmed and excited to see the film!! Amit ji on fire , Kamal ji just wow!! Prabhas I admire your courage to experiment!!
Finally, I wish all the best to my favourite producers,…— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 23, 2024