పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి మూవీ టికెట్లు బుకింగ్ తాజాగా మొదలైన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో ఆన్లైన్ టికెట్ల బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. భారీ రేంజ్ లో కాస్ట్ ఉండడంతో థియేటర్లలో నిమిషాల్లోనే హౌస్ ఫుల్ పడిపోయింది. అయితే టికెట్ బుకింగ్ నేపథ్యంలో చిన్న కన్ఫ్యూజన్ నెలకొంది.
టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో లో ప్రభాస్ కల్కి బదులు.. సీనియర్ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి టికెట్లను కొందరు బుక్ చేసుకున్నారు. అయితే తాజాగా దీనిపై బుక్ మై షో క్లారిటీ ఇచ్చింది. తాజాగా కల్కి సినిమా టికెట్లు బుకింగ్ ఎదురు చూస్తున్న అభిమానులంతా అన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో వెంటనే చాలామంది టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్స్ లో బుకింగ్ కన్‌ఫామ్ అయ్యిన టికిట్స్‌కు రాజశేఖర్ కల్కి పోస్టర్ కనిపించింది. దీంతో టికెట్లు బుక్ చేసుకున్న వారిలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది.
టికెట్లు బుక్ అయిన తర్వాత అది రాజశేఖర్ కల్కి అని చూసిన చాలా మంది షాక్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బుక్ మై షో ను ట్యాగ్ చేస్తూ షేర్ చేశారు. దీనిపై స్పందించిన బుక్ మై షో.. రాజశేఖర్ కల్కి సినిమాకు టికెట్లు బుక్ చేస్తున్నవారు టెన్షన్ పడాల్సిన పనిలేదని.. వారికి కల్కి 2898 ఏడి టికెట్‌లు కన్ఫర్మ్ అయ్యాయంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ సమస్యను త్వరలోనే ఫిక్స్ చేస్తామని వివరించింది. మొత్తంగా రాజశేఖర్ కల్కి బుక్ చేసుకున్న వారికి కూడా కల్కి 2898 ఏడి టికెట్లు కన్‌ఫామ్ అయ్యిన్నట్లేనని వివరించింది. దీంతో అందరి గోళానికి చెక్ పడింది.